సినిమాలకు పవర్ స్టార్ గుడ్ బై..?

Sunday, November 12th, 2017, 12:18:56 PM IST

జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రమే పవన్ చివరి చిత్రమని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు తెలుగు ప్రధాన మీడియాలలో కూడా వార్తలు వస్తుండడంతో ఈ అంశానికి బలం చేకూరుతోంది. త్రివిక్రమ్ సినిమా తరువాత కూడా ఒకటీ రెండు సినిమాలలో నటించడానికి పవన్ కొందరి నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకున్నాడట. దానిని ఇప్పుడు తితిగి ఇచ్చే ఆలోచనలు పవన్ ఉన్నట్లు తెలుస్తోంది.

2017 లో డిసెంబర్ నెల పక్కన పెడితే.. ఎన్నికలకు జనసేన పార్టీని సమాయత్తం చేయడానికి పవన్ కి ఉన్న సమయం కేవలం ఏడాది మాత్రమే. ఒకవేల ముందస్తు ఎన్నికలు వస్తే ఆ సమయం కూడా ఉండదు. దీనితో తన ఫోకస్ మొత్తం పార్టీ పైనే పెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. జనసేన పార్టీకి సంస్థాగతమైన నిర్మాణం లేదు. అధికార ప్రతినిధులు లేరు. ఇటువంటి సమయంలో పార్టీని బలోపేతం చేయడం కత్తిమీద సాము లాంటి పనే. మధ్యలో సినిమా షూటింగులు పెట్టుకుంటే పార్టీ ని బలోపేతం చేయడం చాలా కష్టంగా మారుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలోచన పవన్ కు ఎప్పుడో వచ్చినా.. తనకున్న ఆదాయ వనరు సినిమా మాత్రమే అని ఇప్పటి వరకు కంటిన్యూ చేసారు. త్రివిక్రమ్ సినిమా పూర్తి కాగానే దీనిపై పవన్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే పవర్ స్టార్ ఇక జనసేనాని మాత్రమే.

  •  
  •  
  •  
  •  

Comments