అభిమానిపై దాడి కలచివేసిందన్న పవన్!

Monday, January 5th, 2015, 10:59:32 PM IST

pawankalyan
జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన ‘గోపాల గోపాల’ ఆడియో ఫంక్షన్ సందర్భంగా విచ్చేసిన ఒక అభిమాని గొంతుపై గుర్తు తెలియని అగంతకుడు తీవ్రంగా గాయపరచిన సంగతి తెలిసిందే. అయితే తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ వ్యక్తిని త్వరలోనే వ్యక్తిగతంగా కలవనున్నట్లు పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

ఇక పవన్ తన ట్విట్టర్ ఖాతాలో ‘నిన్న ఆడియో ఫంక్షన్ లో దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఒక అభిమానిపై జరిగిన దాడి నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆ అభిమాని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే వ్యక్తిగతంగా కలుస్తాను. ఇక భవిష్యత్తులో ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. మీ భద్రతే నాకు ముఖ్యం’ అని సందేశాన్ని పోస్ట్ చేశారు.