చెల్లెలు కవిత గారికి కృతజ్ఞతలు : పవన్‌కల్యాణ్‌

Saturday, February 10th, 2018, 12:20:13 PM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నాయకులు కేంద్రంపై ఆందోలనలను చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఏపీ వైఎస్సార్ సీపీ నాయకులు అలాగే టీడీపీ నేతలు పార్లమెంట్ లో స్పెషల్ ప్యాకేజి ఇవ్వాలని నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా రాష్ట్రానికి అన్ని చేస్తామని చెప్పి బడ్జెట్ లో ఏపీ పై కనీసం కనికరం చూపలేదని మండిపడుతున్నారు. అయితే తెలుగు నాయకులకు పూర్తిగా మద్దతు లభిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే తెలంగాణ ఎంపీ సీఎం కూతురు కవిత కూడా ఏపీ నాయకులకు మద్దతు పలికారు.

ఏపీ నాయకుల ఆందోళనలో న్యాయం ఉందని. వారికీ ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లోక్ సభలో మాట్లాడారు. అయితే ఆమెకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపాడు. పార్లమెంట్ లో ఏపీ ప్రజలకు మద్దతు ఇచ్చినందుకు తెరాస ఎంపీ, చెల్లెలు కవిత గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం పవన్ కొందరి ప్రముఖులతో కలిసి తరువాత ఏం చేయాలనే విషయాలపై చర్చలు జరుపుతున్నారు. ఇటీవల లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణతో ఆయన భేటీ అయిన సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments