అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరనలో పవన్‌ ప్రతిజ్ఞ!

Thursday, May 10th, 2018, 03:24:53 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాని ఆవిష్కరించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అభిమానుల మధ్య పవన్ జెండాను ఆవిష్కరించారు. అంతే కాకుండా తన ప్రసంగంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. అలాగే ఒక ప్రతిజ్ఞ చేయించి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపే ప్రయత్నం చేశారు 122X183 అడుగుల (22,326 చదరపు అడుగుల) వెడల్పు గల జాతీయ జెండాను 1857 మే 10న తొలి స్వాతంత్ర పోరాటాన్ని స్మరించుకుంటూ ఆవిష్కరించినట్లు తెలిపారు. అధిక సంఖ్యలో అభిమానులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో పవన్ అభిమానుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ‘భారతీయుడినైన నేను.. భారతదేశ పౌరుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. నా దేశ వారసత్వ సంపదను పరిరక్షిస్తూ.. ప్రకృతికి నష్టం కలిగించకుండా పర్యావరణాన్ని కాపాడుతూ.. అనునిత్యం దేశ ప్రజలకై తపిస్తూ..దేశ ప్రయోజనాలే ప్రథమ చట్టాలుగా భావిస్తూ.. ఎటువంటి కుల,మత, ప్రాంత, వర్గ విభేదాలకు తావులేకుండా దేశ ప్రయోజనాలే పరమావిధిగా పాటిస్తానని మన జెండా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ పవన్ తో అభిమానులు గొంతు కలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments