అమరావతిలో పవన్ పాత్రే కీలకం..?

Monday, December 28th, 2015, 08:31:23 AM IST

pawan
అమరావతి ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను తలదన్నేలా రాజధానిని ప్రపంచస్థాయిలో నిర్మించాలని ఆకాంక్షించారు. ఎలాగైనా అమరావతి నగరం అనుకున్న విధంగా నిర్మించేందుకు బాబు తాపత్రయపడుతున్నారు. అందుకోసం ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు. ఇక ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. నిర్మాణాలు జరగడమే ఆలస్యం.

ఇకపోతే, అమరావతి నగరం నిర్మాణం కోసం, ప్రభుత్వం రైతుల వద్దనుంచి భూములను భూసమీకరణ పద్దతి ద్వారా సేకరించింది. భూసమీకరణ పద్దతి ద్వారా భూములను సేకరించే సమయంలో కొంతమంది రైతులు తమ భూములను ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే, భూములు ఇవ్వని రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాలని ప్రభుత్వం భావించింది. ఆ సమయంలో జనసేన అధ్యక్షుడు రైతుల తరపున వకాల్తా పుచ్చుకోవడంతో.. ప్రభుత్వం వెనక్కి తగ్గింది. భూసేకరణ కాదు.. భూసమీకరణ ద్వారానే భూములను సేకరిస్తామని పేర్కొన్నది.

ఇక, అమరావతిలో రైతుల కోసం పోరాటం చేసిన జనసేన అధ్యక్షుడు.. ఇప్పుడు అమరావతి నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషించాలి. ఎందుకంటే..ఒక నగరం నిర్మాణం జరగాలి అంటే.. అది ఒక్కరి చేతిలో అయ్యే పనికాదు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సపోర్ట్ చేయాలి. కాని, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్షం అందుకు సహకరించే స్థితిలో లేదు అన్నది వాస్తవం. మిత్రపక్షమైన జనసేన ప్రభుత్వానికి సహకరించాలి. కేంద్రంలో కూడా మిత్రపక్షంగా ఉన్నది కాబట్టి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడితోనూ, ప్రధాని మోడీతోను మాట్లాడితే.. రాజధాని నిర్మాణం కాస్త సుళువు అవుతుంది.