ఆంధ్రుల హక్కుల కోసం యుద్ధం చేస్తానంటున్న పవన్ కళ్యాణ్

Wednesday, January 25th, 2017, 06:37:34 PM IST

pawan
జనవరి 26 న వైజాగ్ ఆర్కే బీచ్ లో ప్రత్యేక సాధన సమితి తలపెట్టిన ఆందోళన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ఉద్యమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కొంతమంది యువ హీరోలు కూడా మద్దతు తెలిపారు. అంతేకాదు సంపూర్ణేష్ బాబు, సందీప్ కిషన్ లాంటి హీరోలు తాము ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుండి ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు.

ఆయన కేవలం మద్దతు తెలపడంతో ఊరుకోకుండా భావోద్వేగ భరితమైన ట్వీట్లతో యువతను ఉత్సాహ పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ ఆందోళన కార్యక్రమంలను చేపట్టడానికి అనుమతి నిరాకరించడం తో పవన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. పవన్తా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. శాంతియుతంగా చేద్దామనుకుంటున్న ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అడ్డుకోవాలని చూస్తే ఊరుకోమన్నారు. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఉద్యమం ఇంకా ఉదృతంగా సాగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం యుద్ధం మొదలుపెడతామని హెచ్చరించారు.