పవన్ కళ్యాణ్‌క కేటీఆర్ ఫోన్.. రాజ‌కీయ వ‌ర్గాల్లో సెన్షేష‌న్..?

Thursday, October 18th, 2018, 03:48:10 AM IST

రాజ‌కీయాలు అన్నాక శాస్వ‌త‌మైర వైరం ఉండ‌దు. నాడు ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్న నేత‌లు.. నేడు భాయి, భాయి అనుకుంటూ భుజాల పై చేతులు వేసుకుంటూ తిరుగుతారు. ఈ రోజు ఒకే పార్టీలో ఉన్న‌వాళ్ళు రేపు బ‌ద్ద శతృవులుగా మార‌తారు. రాజ‌కీయ‌లు అన్నాక ఇవన్నీ చాలా కామన్. అయితే ఈ మ్యాట‌ర్ ఇప్పుడెందుకు అంటారా.. ప్ర‌స్తుతం పైన చెప్పిన లాంటి సంఘ‌ట‌నే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇక అసలు మ్యాట‌ర్‌లోకి వెళితే ఇటీవ‌ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ రాజ‌మండ్రిలోకి థ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజ్ పై జ‌న‌సేన క‌వాతు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ జ‌న‌సేన క‌వాతుకు భారీగా స్పంద‌న వ‌చ్చి విజ‌య‌వంతం అయిన సంగ‌తి కూడా తెలిసిందే. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కేటీఆర్ ఫోన్ చేసి అభినంద‌న‌లు చేశార‌నే వార్త రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే గ‌తంలో టీఆర్ఎస్‌కు – ఈ జ‌న‌సేనానికి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ అయితే సంక్రాంతి గంగిరెద్దు అంటూ ప‌వ‌న్ పై సెటైర్లు కూడా వేశారు. అయితే ఆ త‌ర్వాత ప‌వ‌న్ కేసీఆర్ వ‌ద్ద‌కు వెళ్ళి ఆయ‌న పాల‌న బాగుంద‌ని స‌ర్టిఫికేట్ ఇవ్వ‌డం.. ఆ త‌ర్వాత కేసీఆర్ పెట్టాల‌నుకున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం జ‌రిగాయి. అయితే ఇప్పుడు తాజాగా ప‌వ‌న్‌కు కేటీఆర్ ఫోన్ చేసి అభినందించ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.