ఏపీలో ఎన్నికలు దగ్గరవడంతో రాష్ట్ర రాజకీయ నేతలందరూ కూడా తమ కసరత్తులు ముమ్మరం చేశారు… అలాగే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రచారాలు మరియు మీటింగులపై ద్రుష్టి సారించారు… కాగా మంగళవారం నాడు పవన్ కళ్యాణ్ విజయవాడలో పార్టీ కీలక సమావేశం నిర్వహించనున్నారనే తాజా సమాచారం. ఈ కార్యక్రమంలో అభ్యర్థులను నిర్ణయించే స్క్రీనింగ్ కమిటీతో పవన్ మొదటి సారి భేటీ కానున్నారు. అభ్యర్థుల ఎంపికపై పవన్ దిశానిర్దేశం చేస్తారు. ఈసారి ఎలాగైనా రాష్ట్ర రాజకీయాల్లో బలమైన మార్పులు తీసుకొచ్చే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. ఏపీలో అధికారం చేపట్టే బృహత్కర పని కోసం పవన్ అందరిలో కలిసిపోయి, ప్రజలకు ఏదైనా మంచి చేయాలనీ, అంతేకాకుండా ప్రజల్లో అసలే కష్టాలు ఉండకూడదనే ఉద్దేశంతో పవన్ ఉన్నారని సమాచారం. అందుకనే రానున్న ఎన్నికల్లో పవన్ అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ఆ తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీతో సమావేశం కానున్నారు.