ఫ్యాన్స్ కే షాక్ ఇచ్చిన ప‌వ‌న్, నితిన్!

Wednesday, November 16th, 2016, 10:00:30 PM IST

pawan-nithin
ప‌వ‌న్ -నితిన్ కాంబినేష‌న్ లో సినిమా అంటూ ఉంటుంద‌ని ఎప్పుడైనా ఊహించారా? క‌నీసం ఆలోచ‌న‌కు కూడా రాని డౌట్ ఇది. కానీ దీన్ని ద్వ‌యం నిజం చేసి ఇలా షాక్ ఇచ్చారు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు యంగ్ హీరో నితిన్ వీరాభిమాని. ప‌వ‌న్ కూడా నితిన్ కు అంతే వెయిట్ ఇస్తారు. నితిన్ న‌టించిన సినిమాల‌కు సైతం ప‌వ‌న్ ముఖ్య అతిధిగా విచ్చేసిన సంద‌ర్భాలున్నాయి. అఆ షూటింగ్ స‌మ‌యంలో సెట్స్ కు వెళ్లి అప్ డేట్స్ తెలుసుకునే వారు ప‌వ‌న్. ఇటీవ‌ల కాలంలో ఆ అనుబంధం మ‌రింత బ‌ల‌ప‌డింది.

తాజాగా ప‌వ‌న్ నిర్మాత‌గా..నితిన్ హీరో గా ఓసినిమా కూడా ప్రారంభించి అంద‌రికీ షాక్ ఇచ్చిందీ ద్వ‌యం. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి కథని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అందించనున్నారు. ఈ రోజే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఇప్ప‌టివ‌ర‌కూ దీనిపై ఎలాంటి రూమ‌ర్ కూడా రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌టంతో చాలా గ్రేట్. నిజానికి ఈ ఆలోచ‌న కూడా ఎవ్వ‌రికీ త‌ట్ట‌లేదు. `రౌడీ ఫెలో` ఫేం చైత‌న్య కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం నితిన్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అనంత‌రం ఈ కొత్త సినిమా రెగ్యుల‌ర్ షూట్ లో పాల్గొంటాడు.