రాజధానిలో ఆయన స్ఫూర్తి ఉండాలి: పవన్ కళ్యాణ్

Friday, April 6th, 2018, 08:46:40 AM IST


జనసేన అధినేత పవన్ తన రాజకీయ అడుగులను చాలా కొత్తగా వేస్తున్నారన్నది అందరికి తెలిసిందే. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆయనకు ఎంతవరకు అనుకూలిస్తాయి అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోన్న అంశం. పవన్ వ్యతిరేకులు ఆయన ఏ విధంగాను ప్రభావం చూపలేరు అంటుంటే మరికొంత మంది మాత్రం ఏపీ రాజకీయాల్లో ఎంతో కొంత మార్పు వస్తుందని చెబుతున్నారు. ఇకపోతే ఇటీవల ఆయన చేతుల మీదుగా విడుదలైన ‘ఎవరి రాజధాని అమరావతి’ అనే పుస్తకం హాట్ టాపిక్ గా మారింది. ఐవైఆర్ కృష్ణారావు రాసిన ఈ పుస్తకం గురించి పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక పవన్ మాత్రం పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ.. రాజధాని గురించి కొన్ని కొత్త విషయాలని తెలిపారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో గౌతమ బుద్ధుడి బొమ్మ ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే రాష్ట్రంలో బుద్ధుడి స్ఫూర్తి కూడా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. అలాగే బుద్ధుడు ఏనాడు జీవ హింస చేయలేదు. అందరిని సమానంగా చూశాడు. సృష్టి అంతా సమానమే. అదే తరహాలో అమరావతిలో స్ఫూర్తి నింపాలి అని చెబుతూ.. నిజమైన బుద్దిడి స్పూర్తినే కోరుకుంటున్నట్లు జనసేన అధినేత తెలిపారు. అంతే కాకుండా రాజధాని అభివృద్ధి లో అందరు భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా తను కోరుకుంటున్నట్లు పవన్ మాట్లాడారు.

  •  
  •  
  •  
  •  

Comments