జగన్, చంద్రబాబులకు సీమ పౌరుషం ఉంటే…

Friday, December 7th, 2018, 12:20:22 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధికార, ప్రతిపక్షాల మీద ఏమాత్రం కనికరం చూపడంలేదు. ఏ చిన్న ఛాన్స్ దొరికినా వారిని ఏకిపారేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రెజెంట్ అనంతపురంలో జనసేన తరంగం పేరుతో విస్తృత పర్యటన చేస్తూ, ప్రజల్ని ముఖాముఖి కలుసుకుంటున్న పవన్ నిన్న గుంతకల్లులో జరిగిన బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ వారి పౌరుషాన్నే ప్రశ్నించారు.

జగన్, చంద్రబాబులకు నిజంగా రాయలసీమ పౌరుషం ఉంటే గుంతకల్లులో ప్రధాన సమస్య మూతబడ్డ స్పినింగ్ మిల్లును వెంటనే తెరిపించాలని, కార్మికులకు ఉన్న 5 కోట్ల బకాయిల్ని చెల్లించాలని, డిమాండ్ చేశారు. సీమ నుండి వచ్చిన ముఖ్యంనత్రులు చంద్రబాబుతో సహా ఎవరూ సీమ అభివృద్ధిని గురించి కాంక్షించలేదని, గుంతకల్లును పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసే బాధ్యత జనసేనదని హామీ ఇచ్చారు.

తమ ప్రధానమైన స్పిన్నింగ్ మిల్ సమస్యను పవన్ ప్రస్తావించడం, దానిపై అధికార, ప్రతిపక్షాలను ప్రశించడంపై అక్కడి మిల్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.