ఇక్కడ ఒక ఊరిని దత్తత తీస్కోమని చరణ్ ని అడుగుతా..పవన్ కళ్యాణ్.!

Sunday, October 21st, 2018, 12:20:27 PM IST

ప్రస్తుతం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో గత మూడు రోజులు నుంచి పర్యటిస్తున్నారు.తాను కవాతుకు ఇచ్చినంత ప్రాధాన్యత ఇక్కడ టిట్లి భాదితులకు పవన్ ఇవ్వట్లేదని అధికార ప్రతినిధులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అన్న సంగతి తెలిసిందే.అయితే గత మూడు రోజులు నుంచి పవన్ అక్కడ పర్యటిస్తుంటే వెలుగులోకి రాని ఎన్నో పల్లెలకు అందని సాయాలు పవన్ ద్వారా చాలా తెలిసాయి.చాలా మంది ప్రజలు అయితే టీడీపీ నాయకుల మీద తీవ్ర అసంతృప్తిని కూడా పవన్ వద్ద వెల్లడించారు.

అదే విధంగా పవన్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అక్కడి ప్రజల యొక్క భాధలను ఆ ప్రాంతం ఏ స్థాయిలో నష్టపోయిందో ఫోటోలు వీడియోలను పెట్టారు.ఇప్పటికే అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలంచిన పవన్ తన వంతు భాద్యత నిర్వర్తిస్తానని తెలిపారు.ప్రజలు తనకి వోటేసినా వేయకపోయినా ఎప్పుడు వారి పక్షానే నిలబడతానని,తనకి తెలిసినటువంటి సినీ ప్రముఖుల నుంచి ఇక్కడి బాధితులకి సాయం అందివ్వమని కోరుతానని,అంతే కాకుండా తన అన్నయ్య కొడుకు రామ్ చరణ్ ని కూడా ఇక్కడి ప్రాంతాల్లో ఎదో ఒక ఊరిని దత్తత తీసుకోమని చెప్తానని పవన్ అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments