నాకన్నా పెద్ద నటులు చంద్రబాబు మరియు ఆయన ఎమ్మెల్యేలు..పవన్!

Thursday, October 11th, 2018, 12:01:35 AM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రజాపోరాట యాత్ర ఈ సారి కాస్త వివాదాస్పదంగానే జరుగుతుందని చెప్పాలి.ఈ యాత్ర మొదటి లోనే చింతమనేని ప్రభాకర్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇంతకుమునుపు లేని విధంగా టీడీపీ శ్రేణుల నుంచి పవన్ విమర్శలు ఎదుర్కొన్నారు.అదే సందర్భంలో టీడీపీ నేత అయినటువంటి జవహర్ కూడా పవన్ పై తీవ్రంగా మండిపడ్డారు.దీనితో పవన్ కూడా వీరి పై విమర్శలు చేసుకుంటూ వచ్చారు.ఇప్పుడు కూడా తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరియు జవహర్ పైన కొవ్వూరు లో జరుగుతున్నటువంటి బహిరంగ సభలో కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ రహదారుల పక్కన ఎలాంటి మద్యం దుకాణాలు పెట్టకూడదని,కానీ 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగారు మరియు ఆయన పార్టీకి చెందిన మంత్రి జవహర్ గారు ఓకే జీవో తీసుకొచ్చి ఏలూరు జాతీయ రహదారి వద్ద మద్యం దుకాణాలు పెట్టి తాగి వెళ్లి వాహనాలను గుద్దేయ్యండి అని చెప్పడానికి పెట్టించారని పవన్ తెలిపారు,టీడీపీ నాయకులు అందరు నన్ను కేవలం నటుడిగానే రాజకీయాల్లో చూస్తున్నారని,ఇలా జీవోలు తీసుకొచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు భారత రాజ్యాంగానికి గౌరవాన్నిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తాం అని ప్రమాణాలు చేసి,మేము సుప్రీంకోర్టు అంటే చాలా గౌరవం అండి,సుప్రీం కోర్టు ఆదేశాలను శిరసావహిస్తామండీ అని చెప్పినటువంటి వాళ్ళు కదా గొప్ప యాక్టర్లు నేను కాదు అని చురకలంటించారు.

అదే సందర్భంలో చంద్రబాబు గారు ఇంకా అద్భుతమైన నటుడని,తాను మొదటి నుంచి ప్రత్యేకహోదా కోసం ఒకే మాట మీద ఉన్నపుడు ముఖ్యమంత్రి గారు ఒకసారి అంటారు హోదా వల్ల ఏం ఉపయోగం ఉంది,ప్యాకెజీయే బాగుందని ఒకసారి అంటరాని,ఆయన చెప్పిన మాటలు మర్చిపోయారేమో అని 40 సంవత్సారాల వరకు ఎందుకు మూడున్నర సంవత్సరాల క్రితం చెప్పిన మాటలే ఆయనకి గుర్తుండట్లేదని,తాము ఎప్పుడు ప్రత్యేకహోదా మీద ఒకే మాట మీద ఉన్నామంటారు అప్పుడు ఆయన అన్న మాటల రికార్డులు తీసి చూపించినా అక్కడున్నది నేను కాదు ఎవరో అలా పెట్టారు అని అంటారని ఆయన కన్నా పెద్ద నటుడు ఇంకెవరున్నారు అని పవన్ నవ్వుతూనే విమర్శించారు.