ఎన్టీఆర్ అహంకారాన్ని గుర్తుచేసిన పవన్ !

Friday, January 11th, 2019, 07:10:35 AM IST


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెల్లగా విమర్శల ఘాటును పెంచుతున్నారు. మొదట్లో బాబును ఆ తర్వాత లోకేష్ ను, టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమందిని టార్గెట్ చేసిన ఆయన ఇప్పుడు ఏకంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై మాటల తూటాలు పేల్చి సంచలనం సృష్టించారు. నిన్న జిల్లాలవారీగా పార్టీ కోఆర్డినేటర్లతో నేరుగా సమావేశమై పార్టీ విధి విధానాలపై, భవిష్యత్ కార్యాచరణపై చర్చిన ఆయన నాయకుడికి అహంకారం ఎంత చేటు అనే విషయాన్ని వివరిస్తూ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు.

అప్పట్లో ఎన్టీఆర్ పార్టీ తరపున మెదక్ లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుందని అన్నారని, కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారని, తన వెంట లక్షలాది మంది జనం ఉన్నా అహంకారాన్ని నెత్తికి ఎక్కించుకోనని వివరించారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సపోర్టర్లు సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తూ స్పందిస్తుండగా టీడీపీ నేతలెవరూ ఇప్పటి వరకు రియాక్ట్ కాకపోవడం గమనార్హం.