ఇంటికి వెళ్లి పిలిచినా పవన్ రాలేదే..!

Monday, September 19th, 2016, 02:03:15 PM IST

pawan-karnataka-cm
మాజీ ప్రధాని దేవె గౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు నిఖిల్ నటిస్తున్న చిత్రం జాగ్వార్. నిన్ననే హైదరాబాద్ లో ఈ చిత్రం ఆడియో లాంచ్ వేడుక ఘనంగా జరిగింది.ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతాడని అందరు భావించారు. కానీ పవన్ ఆడియో లాంచ్ కు రాకుండా డుమ్మాకొట్టేశాడు.

కొన్ని రోజుల క్రితం కుమార స్వామి స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆహ్వానించిన విషయం తెలిసిందే.కాగా ఆడియో లాంచ్ కు హాజరవుతానని సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్.. సరిగ్గా ఆడియో లాంచ్ టైం కి మాత్రం డుమ్మా కొట్టాడు.మామూలుగానే పవన్ కు సినిమా ఫంక్షన్ లకు హాజరయ్యో అలవాటు లేదు.కానీ ఇటీవల పవన్ సినిమాకు సంభందించిన పలు కార్యక్రమాలకు హాజరవుతుండడంతో జాగ్వార్ ఆడియో లాంచ్ కు కూడా వస్తాడని పవన్ అభిమానులు భావించారు. కానీ అది జరగలేదు. పవన్ అభిమానులు ఎలా ఫీల్ అయ్యి ఉంటారొకాని.. కుమార స్వామి మాత్రం నిరాశ చెంది ఉంటాడు. పవన్ వచ్చి వుంటే జాగ్వార్ చిత్రానికి మంచి హైప్ వచ్చి ఉండేది.పిలిచినా పవన్ రాకపోవడం కుమారస్వామిని నిరాశ పరిచే అంశమే.