వ్యక్తిగత విమర్శలు చెయ్యడం కాదు..జగన్ పై పవన్ మరోసారి సంచలనం.!

Thursday, December 6th, 2018, 03:25:10 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత కొద్ది రోజులు నుంచి పవన్ తీవ్ర స్థాయిలో జగన్ మీద విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే,అయితే పవన్ చేస్తున్నటువంటి విమర్శలకు గాను మొన్న రాష్ట్ర ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ కాస్త ఘాటైన విమర్శలే చేశారు.అప్పటికే జగన్ పవన్ మీద ఒకసారి వ్యక్తిగత విమర్శలు చేసారు.మళ్ళీ మొన్న కూడా ఆ తరహా విమర్శలే పవన్ పై చెయ్యడంతో సోషల్ మీడియాలో జనసేన మరియు వైసీపీ అభిమానుల మధ్య తీవ్ర స్థాయి యుద్ధమే జరుగుతుంది.

అయితే జగన్ చేసినటువంటి విమర్శలకు గాను జనసేన అధినేత పవన్ జగన్ కు దిమ్మతిరిగిపోయే కౌంటర్లు ఇచ్చారు.ప్రజల సమస్యల పట్ల మాట్లాడకుండా తనమీద వ్యక్తిగత విమర్శలు చేస్తే తన ఒంటికి చిల్లు ఏమి పడదని,మీకు నిజంగా ప్రజల మీద అంత ప్రేమ ఉంటే వ్యక్తిగత విమర్శలు చెయ్యడం కాదు ఇక్కడ రాయలసీమలో ప్రజలు వెనుకబడిపోయారు వారి సమస్యల మీద పోరాడాలని పవన్ సూచించారు.అసెంబ్లీకి వెళ్లి వీరి యొక్క సమస్యల మీద పోరాడాలని వైసీపీ అధినేత జగన్ మరియు వైసీపీ నేతలకు పవన్ కౌంటర్లు ఇచ్చారు.