కేంద్రాన్ని నిలదీస్తా.. జైల్లో పెట్టినా భయపడను !

Saturday, January 27th, 2018, 10:05:01 PM IST

కొన్ని రోజుల క్రితం తెలంగాణాలో పవన్ జరిపిన ప్రజాయాత్ర సక్సెస్ అయినా సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పవన్ తన దృష్టిని ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ పై ఉంచాడు. అక్కడ పార్టీని బలోపేతం చేయాలనీ పవన్ పక్క ప్రణాళికలతో వెళుతున్నాడు. అభిమానులే కాకుండా రైతు కుటుంబాలు కూడా పవన్ ని చూడటానికి వస్తున్నారు. అయితే సభలో పవన్ రాయలసీమ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళతానని చెప్పాడు. గత కొంత కాలంగా అనంతపూర్ లో చాలా సమస్యలు అలానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సమస్యలపై సమాధానం ఇవ్వాలి అని చెప్పారు. అంతే కాకుండా రైతుల కష్టం ఏమిటో తనకు తెలుసని ఎందుకంటే తాను కూడా ఒక రైతునే అని పవన్ వివరించాడు. అంతే కాకుండా సమస్యలపై స్పందించేవరకు తాను ఎంత దూరం అయినా వెళతానంటూ.. అవసరం అయితే జైలులో పెట్టినా భయపడను అని పవన్ తెలియజేశాడు. రైతులు కన్నీరు పెడితే అది పాలకులకు శాపమని రైతులు కన్నీరు పెట్టని అనంతపురాన్ని చూడాలన్నదే ఆశయంతో సదస్సులను పెడుతున్నానని జనసేన అధినేత వివరించారు.