పవన్ లోకేష్ ను టార్గెట్ చేయడం వెనుక కారణం !

Wednesday, October 3rd, 2018, 01:10:00 PM IST

రాబోయే రోజుల్లో టీడీపీ ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే అనుమానం లేకుండా నారా లోకేష్ అని చెప్పొచ్చు. చంద్రబాబు తరవాత అతన్నే పార్టీకి అధినేతను చేసే ప్రయత్నాలు ఎప్పటి నుండో ముమ్మరంగా జరుగుతున్నాయి. అందుకే పవన్ లోకేష్ ను టార్గెట్ చేశాడు. ఈ మధ్య పవన్ చేసిన ప్రసంగాల్ని వింటే లోకేష్ ప్రస్తావన ఎక్కువగా తెస్తున్నారాయన.

తాజాగా నిన్న జంగారెడ్డిగూడెం బహిరంగ సభలో మాట్లాడిన పవన్ లోకేష్ గారు 14 వేల కిలోమీటర్ల రోడ్డు వేశామని అన్నారు కానీ ఇక్కడ 14 కిలోమీటర్లు వెళ్ళడానికి 40 నిముషాలు పట్టింది. రోడ్లనీ వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరిగే చోట్ల మాత్రమే వేసుకుంటే సరిపోదు అంటూ రాబోయే 2014 ఎన్నికల్లో లోకేష్ ఆధ్వర్యంలో ఒక్కొక్క నియోజవర్గానికి 25 కోట్ల వరకు ఖర్చు చేసే ఏర్పాట్లు బాబు చేస్తున్నారని ఆరోపించి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసుకుంటూ పొతే ఎవరు కడతారు మీ అబ్బాయి లోకేష్ కడతాడా అంటూ ఎద్దేవా చేశారు.

ఈ విమర్శలను జనం కూడ ఎంజాయ్ చేస్తున్నారు. దీన్నిబట్టి అతి సులభంగా రాజకీయాల్లోకి ఎంటరైపోయి ఉత్తపుణ్యాన పదవి అందుకుని, నాలుగున్నరేళ్లలో ప్రజల చేత ఫలానా విషయంలో ఇతగాడు మేటి అని అనిపించుకోలేకపోయిన లోకేష్ ను ఆరంభం నుండే నిర్వీర్యం చేయాలని, తద్వారా భవిష్యత్తులో లాభం ఉంటుదని పవన్ భావిస్తున్నట్టు ఉన్నారు.