దళిత వర్గాలని ఆకర్షించేందుకు పవన్ వ్యూహాలు..!

Wednesday, October 24th, 2018, 11:48:09 AM IST

మేనిఫెస్టోలో ఆర్ధిక అసమానతలను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు కల్పిస్తామంటూ అన్ని వర్గాల దృష్టిలో కాస్త పాజిటివ్ అభిప్రాయాన్ని సంపాదించుకోగలిగిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక్కో సామాజిక వర్గానికి దగ్గరయ్యేలా బలమైన ప్రణాళిక రచించుకుని ముందుకెళుతున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు తాము అనుకూలమనే సంకేతాలు పంపి బీసీలకు చేరువైన పవన్ దళితుల్లో కూడ ఇదే నమ్మకాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు.

అందులో భాగంగానే బిఎస్పీ నేతలతో కీలక సమావేశం కోసం లక్నో వెళ్లారు. ఆయన వెంట నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రతి నిధులు, ఉస్మానియా విద్యార్థులు, విద్యావేత్తలు ఉన్నారు. ఈ పరిణామంతో దళిత వర్గాలకు పార్టీ మరింత దగ్గరయ్యే ఛాన్సుందని జనసేన శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాదు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల కూటమి అభ్యర్థిగా మాయావతి పేరు పరిశీలనలో ఉండటంతో ఈ సమావేశం భవిష్యత్ రాజకీయాలకు కూడ కలిసొస్తుందని పవన్ భావిస్తున్నారట.