వీడియో లీక్ : మీడియాకు షాకిచ్చిన పవన్..

Sunday, April 22nd, 2018, 09:05:36 AM IST

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా చేస్తోన్న ఆరోపణలు ఒక్కొక్కటి సంచలనం సృష్టిస్తున్నాయి. తనకు జరిగిన అన్యాయం విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదంటూ పవన్ సందిస్తోన్న బాణాలు ప్రముఖ మీడియాల్లో ప్రకంపనలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ వ్యక్తి వీడియోను పవన్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు. ఓ వ్యక్తి అతని కాళ్ల మీద పడటం ఆ వీడియోలో కనిపిస్తోంది.

ఆ పేద వ్యక్తి అతని కాళ్ల మీద ఎందుకు పడ్డాడో ఎవరికైనా తెలుసా అని పవన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది.ఆ వీడియో ఇంతకుముందు కూడా బాగా వైరల్ అయ్యింది. అయితే దానికి సమాధానం ఇవ్వాలని పవన్ కోరాడు. పవన్ ఇంకా ఎలాంటి విషయాల గురించి స్పందిస్తాడా? అని నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. సినీ పరిశ్రమల నుండి పవన్ కు మద్దతు బాగానే అందుతోంది. దర్శకులు రచయితలు నిర్మాతలతో పాటు కొంత మంది హీరోలు కూడా పవన్ కు మద్దతు పలికారు.

  •  
  •  
  •  
  •  

Comments