ప‌వ‌న్ (X) బాబు: 19ల‌క్ష‌ల కాపు ఓట్లు గ‌ల్లంతు!?

Thursday, October 4th, 2018, 03:57:24 AM IST

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో నాయ‌కులు ఎలా పెడ‌దారి ప‌ట్టిపోయారో, రాజ‌కీయాలు ఎంత దుర్మార్గంగా మారాయో చెప్పుకోవ‌డానికి ఇంత‌కంటే ఎగ్జాంపుల్ అక్క‌ర్లేదు. ప‌దుల సంఖ్య‌లో కాదు, వంద‌ల సంఖ్య‌లో కాదు, ఏకంగా 19 ల‌క్ష‌ల కాపు ఓట్ల‌ను చంద్ర‌బాబు – తేదేపా లీడ‌ర్స్ గ‌ల్లంతు చేశారంటే ఎంత పెద్ద కుట్ర జ‌రిగిందో అర్థం చేసుకోవాలి. ఈ లీక్ ఇచ్చింది ఎవ‌రో కాదు, జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. తాజా ప‌ర్య‌ట‌న‌లో బాబు కుట్ర‌ల్ని ఒక‌టొక‌టిగా నేరుగా ప్ర‌జ‌ల‌కే చెబుతున్నారు ప‌వ‌న్‌. త‌న‌దైన‌ వాగ్ధాటితో.. నిజాయితీగా ప‌వ‌న్‌ నోటి నుంచి వ‌చ్చే మాట‌ల‌తో.. ఇలాంటి ద‌గుల్బాజీ రాజ‌కీయం ఇంకెక్క‌డా చూడ‌లేమ‌ని జ‌నాల‌కు కూడా అర్థ‌మ‌వుతోంది.

తొల‌గించిన 19ల‌క్ష‌ల ఓట్ల‌లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు సంబంధించి ఓట్లు మెజారిటీ పార్ట్ తొల‌గించార‌నేది ప‌వ‌న్ ఆరోప‌ణ‌. అంటే ఇందులో కాపు ఓట్లు, ప‌వ‌న్ కి స‌పోర్టుగా ఉండే ఓట్లు ఎక్కువ‌గా ఉంటాయ‌న్న వాద‌నా వినిపిస్తోంది. త‌న కోసం చ‌నిపోతాన‌ని అనేకంటే.. తాను గెలిచేందుకు ఓటు వేస్తే చాల‌ని ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా కోరారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి (నేటి నుంచి) అక్టోబర్ 30వ తేదీ వరకు ఓటరుగా రిజిస్టర్ చేయించుకోమ‌ని యూత్‌కి పిలుపునిచ్చారు. మీ అరుపులు, కేకలు నాకు వద్దని, ఓటరుగా రిజిస్టర్ చేయించుకోండని సూచించారు. ఎన్నికల్లో జనసేనకు ఓటు వేస్తే అప్పుడు మార్పు వస్తుందని ప‌వ‌న్ ఉద్ఘాటించారు. అయితే ప‌వ‌న్ చేస్తున్న ఈ వ్యాఖ్య‌లేవీ నిరాధార‌మైన‌వి కావు. ప్ర‌తిదీ ఆధారంతోనే ప‌వ‌న్ మాట్లాడుతున్నారు. వైరి ప‌క్షాలు త‌మ‌కు ముప్పు వ‌స్తుంది అంటే అమాయ‌క ప్ర‌జ‌ల్ని అంతం చేసి అయినా కుర్చీ లాక్కునే ద‌గుల్భాజీ రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌తార‌న‌డంలో సందేహం లేదు. ఈసారి ఎన్నిక‌ల్లో ఒక అగ్ర సామాజిక వ‌ర్గం అంతు చూడ‌డ‌మే ధ్యేయంగా ఇత‌ర‌త్రా సామాజిక వ‌ర్గాల‌న్నీ జ‌ట్టు క‌ట్ట‌డంతో బాబుకు ఏం చేయాలో తోచ‌డం లేదు. ఆ క్ర‌మంలోనే త‌న‌కు మైన‌స్ అయ్యే కాపు ఓట్ల‌ను పెద్ద మొత్తంలో తొల‌గించేస్తున్నార‌న్న మాటా ఏపీలో వినిపిస్తోంది.