వీడియో : భార్య చేసిన పనికి నవ్వుకున్న పవన్

Monday, January 22nd, 2018, 03:57:25 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తన యాత్రను స్టార్ చేశాడు. తెలంగాణ జిల్లాల ద్వారా యాత్రను స్టార్ట్ చేసిన హిందూ సాంప్రదాయ ప్రకారం కొన్ని నియమాలను పాటించాడు. అయితే ముందుగా కారుకు ధిష్ఠి తీయాలని నిర్ణయించగా ఆయన సతిమణి అన్నా లెజినోవా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే హిందూ సంప్రదాయల గురించి ఎక్కువగా తెలియక అన్నా ముందుగా తడబడింది. అయితే పవన్ ఆమెకు సైగలు చేసి కరెక్ట్ గా వివరించాడు. అయితే అన్నా కొబ్బరి కాయ మొదట పగలలేదు. దీంతో ఆమె ఆశ్చర్యపోగా పవన్ ఒక్కసారిగా నవ్వేశాడు. మళ్లీ కొట్టమని చెప్పడంతో ఈ సారి అన్నా కొంచెం గట్టిగా కొట్టింది. మొత్తానికి టెంకాయ పగలడంతో జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా హర్షద్వానాలు చేశారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.