సంచలనంగా మారుతున్న పవన్ పేపర్ పై రాసుకున్న వాఖ్యాలు..!

Wednesday, October 24th, 2018, 04:09:12 PM IST

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన కవాతులో పడి శ్రీకాకుళంలో తిత్లి తుఫాన్ బాధితులను పట్టించుకోవట్లేదని తెలుగుదేశం మరియు ఇతర పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే.అయితే అనంతరం వెంటనే పవన్ శ్రీకాకుళం చేరి క్షేత్రస్థాయిలో పర్యటన చేసి కొన్ని టీడీపీ వారు అందించిన సహాయ సహకారాలు సక్రమంగా అందనటువంటి,గ్రామాలను వెలుగులోకి తీసుకువచ్చారు.పవన్ అక్కడ అడుగు పెట్టిన మొదటి నుంచే బాధితుల యొక్క కష్టాలను అడిగి తెలుసుకుని వాటిని ఒక పుస్తకంలో రాసుకుంటున్నారు.

అయితే ఆ విధంగా రాసుకున్న పవన్ యొక్క వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. పవన్ అక్కడికి వెళ్లి డబ్బులు, బిర్యాని పార్శిల్లు పంచుకున్నారని ఇప్పుడు కొంత మంది పవన్ పై విమర్శలు చేస్తున్నారు.పవన్ తాను పట్టుకున్న ఒక పుస్తకంలో బిర్యానీ,పార్సిల్ మరియు లక్ష అనే పదాలు ఉన్నటువంటి ఫోటోని చూపిస్తూ విమర్శలు చేస్తున్నారు.పవన్ రాసుకున్నటువంటి ఆ వ్యాఖ్యలు కాస్త అర్ధం కాకుండా ఉన్న సరే దగ్గర దగ్గరికి అలానే ఉండటంతో ఇక పవన్ అక్కడికి వెళ్లి డబ్బులు,బిర్యానీలు పంచుకుంటున్నాడని ప్రచారం చేస్తున్నారు.అది నిజమో కాదో అసలు ఏ పరిస్థితిలో పవన్ అలా రాసుకున్నారో కూడా అజ్ఞ్యానంలో మిగతా పార్టీ నేతలు ఉన్నారని జనసేన కార్యకర్తలు వారికి సమాధానం ఇస్తున్నారు.