2019 బిగ్ ఫైట్.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్.. పోటీ అక్క‌డి నుండే..!

Wednesday, November 7th, 2018, 08:05:14 PM IST

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా చేస్తున్న వ్యాఖ్య‌లకు.. ఆయ‌న ప్ర‌క‌ట‌న‌ల‌కు విశ్వ‌స‌నీయ‌త‌లేకుండా పోతుందని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం త‌న యాత్రలో భాగంగా ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు చూస్తుంటే.. ప్ర‌తి ఒక్క‌రు నిజ‌మే క‌దా అంటున్నారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా.. పిఠాపురం నియోజ‌క వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అక్క‌డ నిర్వ‌హించిన స‌భ‌లో తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పిఠాపురం నుండి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెలువెత్తుతున్నాయి.

ప‌వ‌న్ త‌న ఏ నియోజక వ‌ర్గానికి వెళ్ళినా అక్క‌డ నుండి పోటీ చేస్తాన‌ని చెప్ప‌డం ప‌రిపాటిగా మారింది. గ‌తంలో తెలంగాణ అంటే త‌న‌కు చాలా ప్రాణ‌మ‌ని దీంతో తెలంగాణ‌ నుండే పోటీ చేస్తాన‌ని అన్నారు. ఆ త‌ర్వాత ఏపీలోకి అనంత‌పురం వెళ్ళిన ప‌వ‌న్ అక్క‌డి నుండి పోటీ చేస్తాన‌ని చెప్పారు. ఇక ఆ త‌ర్వాత పాడేరు నుండి, ఆ త‌ర్వాత అన‌కాప‌ల్లి, ఆ త‌ర్వాత ఇచ్ఛాపురం, ఆ త‌ర్వాత తిరుప‌తి నుండి ఇలా ప‌వ‌న్ ఎక్క‌డ అడుగు పెడితే అక్క‌డి నుండి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ వ‌చ్చారు. అయితే ఇప్పుడు తాజాగా పిఠాపురం వంతు వ‌చ్చింది. శ్రీపాద వల్లభుడంటే తనకెంతో ఇష్టంమ‌ని.. ఆయన ఆశీస్సులు ఉంటే పిఠాపురం నుంచే పోటీచేస్తాన‌ని ప‌వ‌న్ అన్నారు. దీంతో ప‌వన్ ఎక్క‌డి నుండి పోటీ చేస్తాడో తెలియ‌క జ‌న‌సేన శ్రేణులు కూడా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments