చంద్రబాబుకి పవన్ నుంచి మరో స్వీట్ వార్నింగ్..!

Tuesday, October 23rd, 2018, 12:05:44 AM IST

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో టిట్లి తుఫాను బాధితులకు అండగా గత కొద్ది రోజులు నుంచి అక్కడే విశ్రాంతి లేకుండా తిరుగుతూ వారి యొక్క కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు.పవన్ వెళ్ళకముందు ఆయన మీద తెలుగుదేశం నాయకులు పలు రకాల విమర్శలు చేశారు.తీరా అక్కడికి వెళ్లిన తర్వాత తెలుగుదేశం వారు తలదించుకునే స్థాయిలో పవన్ దగ్గర అక్కడ బయటకి రాని గ్రామాలకు చెందినటువంటి ప్రజలు, యువత తమ గోడుని వెళ్లగక్కుకున్నారు.దీనితో అక్కడికి పర్యటనకి వస్తున్న టీడీపీ నేతలకు కూడా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి.

ఇప్పుడు ఈ అన్ని విషయాల మీద పవన్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న స్వీట్ వార్నింగ్ లా ఇచ్చారు.అసలు శ్రీకాకుళం ప్రజలంటే వారి పార్టీ నేతలు ఎందుకని అంత చులకనగా చూస్తున్నారని,వారి యొక్క యాస భాషలను చులకన చేసే విధంగా వారి పార్టీ నేతలు మాట్లాడటం వల్ల ఇక్కడి ప్రజలు ఎంత మనో వేదనకు గురవుతున్నారో మీకు తెలుసా అని అన్నారు.టీడీపీ నేతలు ఇక్కడి ప్రజల యొక్క యాస గురించి చులకన చేసి మాట్లాడ్డం వల్ల ఇక్కడి యువత కూడా తమ ఆవేదనను తన దగ్గర వ్యక్తం చేశారని పవన్ తెలిపారు.

ఒకవేళ టీడీపీ నేతలు ఇదే పంథా కొనసాగిస్తే తర్వాత తర్వాత వీటి యొక్క పరిణామాలు వేరే స్థాయిలో ఉంటాయని పవన్ అన్నారు.అంతే కాకుండా ఇక్కడ జనసేన పార్టీకి ఎవరైతే మద్దతుగా ఉంటున్నారో వారిని ఇక్కడ టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని,ఇక నుంచి అయినా వారి బెదిరింపు చర్యలను మానుకోకపోతే ఇక్కడి ప్రజలే వారి మీద తిరగబడతారని అప్పుడు ఎవరు ఏమి చెయ్యలేరని అందువల్ల వారి పార్టీ యొక్క నేతలను అదుపులో పెట్టుకోవాలని పవన్ తనదైన శైలిలో చిన్నపాటి వార్నింగ్ లా ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments