తెలంగాణ ఎన్నికలపై జనసేనాని షాకింగ్ కామెంట్స్..తెరాస నుంచి 25 మంది సిద్ధంగా ఉన్నారట.!

Sunday, October 14th, 2018, 04:00:46 AM IST

గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా పోరాట యాత్ర చేస్తున్న సంగతి తెలిసినదే.అంతే కాకుండా కొంత మంది కీలక నేతలు జనసేనలో కూడా చేరుతున్నారు.ఇప్పటికే పవన్ ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించేశారు.కానీ తెలంగాణా రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు మాత్రం ఇప్పటి వరకు సరైన స్పష్టత మాత్రం ఇవ్వలేదు.గత కొద్ది రోజుల క్రితం తాను తెలంగాణలో బలంగా ఉన్న అన్ని చోట్ల కూడా పోటీ చేస్తానని చెప్పి మళ్ళీ ఆ ఊసే ఎత్తలేదు.

ఇప్పుడు తాజాగా పవన్ తెలంగాణ ఎన్నికల పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.అనుకున్న సమయం కన్నా ఈ సారి కాస్త త్వరగానే ఎన్నికలు రావడం ఎవ్వరు ఊహించలేదని,నిజానికి తాను 2019 ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్నానని తెలిపారు.అంతే కాకుండా ఇది వరకే 2009 ఎన్నికల సమయంలోనే తాను తెలంగాణా రాష్ట్రం అంతటా పర్యటించానని,అప్పుడు తనతో పని చేసినటువంటి కొంత మంది కార్యకర్తలు ఇప్పుడు తెరాస పార్టీలో ముఖ్య పాత్ర వహిస్తున్నారని,దాదాపు 25 మంది తాను సరే అంటే వారు జనసేన పార్టీ నుంచి పోటీ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు అని అన్నారు.అదే సందర్భంలో ప్రస్తుతం ఆంధ్ర లో తన ప్రజా పోరాట యాత్ర వలన కొంచెం బిజీగా ఉన్నానని,ఇంకో నాలుగు రోజుల్లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ మీద ఒక స్పష్టత ఖఛ్చితంగా ఇస్తానని తెలిపారు.