జనసేన పార్టీ తొలి అభ్యర్థిని ప్రకటించిన పవన్..!

Tuesday, September 11th, 2018, 04:40:32 PM IST

జనసేన అధినేత మొట్ట మొదటి సారిగా వారి పార్టీ నుంచి తొలి అభ్యర్ధికి టిక్కెట్టు ఇచ్చినట్టుగా ప్రకటించారు. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో జనసేన కార్యకర్తలతో పవన్ ఒక చిన్నపాటి మీటింగును నిర్వహించారు. అయితే ఈ మీటింగులోనే ముందు వైసీపీ పార్టీకి పనిచేసినటువంటి పితాని బాల కృష్ణ గారు పవన్ కళ్యాణ్ సమక్షం లో వారి అనుచరులతో సహా జనసేన తీర్ధం పుచ్చుకొని జనసేన పార్టీలో చేరారు.

ఆ తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ తనని జగన్ ఏ విధంగా మోసం చేశారో తన ఆవేదన మొత్తం వెళ్లగక్కుకున్నారు. అదే సమయం లో పవన్ ముందు బాలకృష్ణ గారిని చాలా సార్లు కలిసానని అయన చాలా బలమైన వ్యక్తి అని, కానీ ఎప్పుడు సీటు ఇస్తాను అని చెప్పలేదు అని, కానీ ఈ రోజు జనసేన పార్టీ తరపున మొట్ట మొదటి బీ ఫారం టిక్కెట్టు పితాని బాలకృష్ణ గారికి ప్రకటిస్తున్నాం అని ఆయనకీ తప్ప వేరే ఎవరికీ ఇచ్చేది లేదు అని కూడా తెలియజేసారు.

  •  
  •  
  •  
  •  

Comments