నేను జగన్ లా పాదయాత్రలు,ముద్దులు పెట్టడానికి రాలేదు..పవన్

Tuesday, October 9th, 2018, 06:35:48 PM IST

జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ప్రజా పోరాట యాత్రలో నిమగ్నమై ఉన్న సంగతి తెలిసినదే.ఇప్పుడు అతని ప్రజా పోరాట యాత్రలో భాగంగా ప్రస్తుతం పోలవరంలోని పర్యటిస్తున్నారు.ఈ యాత్రలో భాగంగా అక్కడ నిర్వహించినటువంటి సభలో చంద్రబాబు మరియు జగన్ లపై కొన్ని వ్యాఖ్యలు చేశారు.తెలుగుదేశం పార్టీ వారు బస్సుల్లో ప్రజానీకాన్ని తీసుకెళ్తుంటారని,అదే సందర్భంలో ఇక్కడి గ్రామస్థులు కూడా అమరావతికి తీసుకెళ్తే అక్కడి అభివృద్ధి ఎలా ఉందొ తెలుసుకుంటాం అనగా అసలు అక్కడ ఏం అభివృద్ధి జరుగుతుంది.ఏం జరగట్లేదని తెలిపారు.

గిరిజన ప్రాంత ప్రజలకు,వేల ఎకరాలు భూములు తీసుకొని వారికి రాళ్ళ భూములు ఇచ్చి అన్యాయం అయ్యిన వాళ్లకు అండగా నిలబడి బలంగా మాట్లాడే పార్టీ ఒక్కటి కూడా లేదని,తాను రాజకీయాల్లోకి వేల కోట్లు సంపాదించుకోవడానికో లేక ఏవో పదవులు ఆశించో రాలేదని,క్షేత్ర స్థాయి నుంచి రాజకీయ ప్రక్షాళన జరగాలని తన జీవితాన్ని ఇవ్వడానికి రాజకీయాల్లోకి వచ్చానన్నారు.అంతే కానీ జగన్ మోహన్ రెడ్డి గారిలా పాదయాత్రలు చేస్తూ ముద్దులు పెట్టడానికి రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు.