పవన్ రికార్డును “హరికృష్ణ” గారికి అంకితమిచ్చిన ఫ్యాన్స్!

Tuesday, September 4th, 2018, 05:25:09 PM IST

ఇటీవలే శ్రీ గౌరవనీయులైన “నందమూరి హరికృష్ణ” స్వర్గస్థులు అయిన విషయం తెలిసినదే, అదే విధంగా సెప్టెంబరు 2 వ తేదీన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున వారి అభిమానులు ట్విట్టర్ వేదికగా 7.4 లక్షల ట్వీట్లు ద్వారా తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది మనకి తెలిసినదే..

కానీ అదే రోజు అనగా సెప్టెంబర్ 2 వ తేదీన స్వర్గస్థులైన శ్రీ నందమూరి హరికృష్ణ గారి పుట్టినరోజు కూడా.. అయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తాము చేసిన ఈ ట్రెండ్ అంతటిని నందమూరి హరికృష్ణ గారి గౌరవార్థంగా అంకింతం చేస్తున్నాము అని తెలియజేసారు.. ఈ విషయం తెలిసిన నందమూరి కుటుంబ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

  •  
  •  
  •  
  •  

Comments