థమన్ ఇచ్చిన పాటకి ప్రశంసల్లో ముంచెత్తిన పవన్ కళ్యాణ్!

Saturday, October 13th, 2018, 05:39:20 PM IST

ప్రస్తుతం థమన్ పేరు “అరవింద సమేత” చిత్రంతో మారు మోగిపోతుంది.దీనికి కారణం అతను సమకూర్చిన పాటలు.ఐతే తాజాగా ప్రముఖ హీరో మరియు రాజకీయ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థమన్ ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.దీనికి గల కారణం అరవింద సమేత చిత్రంలోని పాటలు అనుకుంటే పొరపాటు పడినట్టే మరి పవన్ తో కూడా సంగీత దర్శకునిగా థమన్ ఏ చిత్రానికి పని చేయలేదు.ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ పవన్ యొక్క చిత్రాల్లో “ఖుషి” సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయింది ఆ సినిమాలో ఉన్నటువంటి హిందీ పాట “యే మేరా జహా” అప్పట్లో ఒక కుర్ర కారుని ఒక ఊపు ఊపేసింది.

ఆ చిత్రానికి సంగీతం అందించింది మణిశర్మ అయినా ఆ పాటకి మాత్రం స్వరాలని అందించింది థమనే ఈ విషయం పవన్ ఇది వరకే నితిన్ చల్ మోహన్ రంగా ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పారు.ఇప్పుడు మళ్ళీ తాజాగా పవన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ”ఇంత మంచి పాటని తయారు చేసి తనకి అందించిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి మరియు ఆ పాటకి సాహిత్యాన్ని అందించిన రామజోగయ్య శాస్త్రి గారికి తన ధన్యవాదాలు తెలుపుకున్నారు”.ఈ పాటకి గాను థమన్ ముఖ్యమైన పాత్ర పోషించారని తెలిపారు.థమన్ మరియు రామజోగయ్య శాస్త్రిల యొక్క రూప కల్పన గల ఈ పాట ఈ నెల జరగబోయే “కవాతు”కు స్ఫూర్తిగా నిలవబోతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు.ఈ ట్వీట్ కు గాను థమన్ కూడా తన ఆనందాన్ని వ్యక్త పరిచారు.

haman . He played a very crucial, creative role in composition of ‘ Yeh Mera Jaha ‘song in Khushi 2001, who was in his teens then. Lyrics by Sri Ramajogayya Sastri Garu reflects the spirit of ‘Kavathu’

— Pawan Kalyan (@PawanKalyan) October 13, 2018