అన్ని ఆలోచించే శ్రీకాకుళం తిత్లి తుఫాన్ బాధితుల దగ్గరకి ఇంకా వెళ్ళలేదు : పవన్

Sunday, October 14th, 2018, 12:02:12 AM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే శ్రీకాకుళం జిల్లా అంతటిని కుదిపేసిన “తిత్లి” తఫాను విషయంపై స్పందించారు.ప్రస్తుతం ఈ నెల 15 వ తేదీన ధవళేశ్వరం బ్యారేజీ పైన జరగబోయే కవాతుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.అందుకు గాను తన ప్రజా పోరాట యాత్రకి కాస్త విరామం కూడా ఇచ్చారు.2014 లో ”హుదూద్” తుఫాన్ తరహాలో ఈ తిత్లి తుఫాను శ్రీకాకుళం జిల్లా అంతటిని కకలావికలం చేసేంది.ఇప్పుడు ఈ విషాధ ఘటనపై తాను ఇంకా అక్కడికి వెళ్ళలేదో పవన్ ఈ రోజు స్పష్టత ఇచ్చారు.

శ్రీకాకుళం ప్రాంతంలో ఇంతటి భీబత్సం చోటు చేసుకోవడం తనని కలచి వేసిందని పవన్ తెలిపారు. ఈ ఘటన కోసం తెలిసిన వెంటనే తాను అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నానని కానీ ఇంతకు ముందు జరిగినటువంటి ఇలాంటి సంఘటనల దృష్ట్యానే అక్కడి పోలీసు శాఖ వారికి,రెస్క్యూ వారికి అక్కడ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండడానికే తాను ఈ సారి వెంటనే వెళ్లలేదని తెలిపారు.ఈ నెల 15 వ తేదీన నిర్వహించబోయే భారీ కవాతు అనంతరం వెంటనే శ్రీకాకుళం వెళ్లి అక్కడ తిత్లి తుఫాన్ బాధితులను పరామర్శిస్తానని,5తాను ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు.