ప‌వ‌న్ ఏంటి జ‌గ‌న్‌ను.. అంత మాట అన్నావ్..?

Wednesday, November 14th, 2018, 01:17:15 PM IST

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం బహిరంగ సభలో ప‌వ‌న్ మాట్లాడుతూ.. పాద‌యాత్ర అంటూ రోడ్లు మీద తిరుగుతున్న జ‌గ‌న్.. అసెంబ్లీకి వెళ్ళి ప్ర‌జాస‌మ‌స్య‌ల పై అధికార పార్టీని నిల‌దీస్తే.. అప్పుడు మ‌గ‌తనం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. బాధ్య‌త గ‌ల ప‌ద‌విలో ఉన్న జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్ళ‌కుండా త‌న‌ని విమ‌ర్శించ‌డ‌మేంట‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.

ఇక రెడ్డి కుల‌స్థుల భూములను వైసీపీ నేత‌లే దోచుకుంటున్నార‌ని.. అయితే బాదితుల‌ను ప‌ట్టించుకునే వారే లేరని ప‌వ‌న్ అన్నారు. త‌న వ‌ద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు లేక‌పోయినా ప్ర‌జా స‌మ‌స్య‌ల పై పోరాడుతూ వాటికి ప‌రిష్కార మార్గాల‌ను క‌నుక్కుంటున్నాన‌ని.. అయితే వైసీపీ నేత‌లు మ‌త్రం ప్ర‌జ‌ల‌ను పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నార‌ని ప‌వ‌న్ మండిప‌డ్డారు. ఇక కుల రాజ‌కీయాలంటే త‌న‌కు అస్స‌లు న‌చ్చ‌ద‌ని.. కుల దూష‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్న టీడీపీ నేత‌లు.. త్వ‌ర‌లోనే త‌న‌లో ఉన్న మ‌రో వ్య‌క్తిని చూస్తార‌ని ప‌వన్ ఫైర్ అయ్యారు. ఇక చివ‌రిగా ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వం కోస‌మే తాను పంచెక‌ట్టు క‌ట్టాన‌ని ప‌వ‌న్ తెలిపారు.