నా ఇంటి పేరు కొణిదెల కాదు..పవన్ కళ్యాణ్ సంచలనం.!

Friday, November 16th, 2018, 03:31:03 AM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన పోరాట యాత్రను మరింత వేగవంతం చేశారు.ఈ రోజు జరుగుతున్నటువంటి పోరాట యాత్ర లోని భాగంగా పవన్ తూర్పు గోదావరి జిల్లా రాజనగరం లోని నిర్వహించిన బహిరంగ సభలో తన రాజకీయ జీవితం గురించి మరియు తన ఇంటి పేరు గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను రాజకీయాల్లోకి వెళ్తానని 2003 లోని తన తల్లితో చెప్తే మనకి రాజకీయాలు ఎందుకు అని చెప్పిన తన తల్లే మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత తానే వచ్చి 4 లక్షలు విరాళంగా ఇచ్చారని,ఆ సందర్భంలో తన తల్లి చెప్తూ తాను రాజకీయాల్లో బాగుండాలని,ఇక నుంచి నువ్వు మా కుటుంబం కాదు అని అన్నారని పవన్ తెలిపారు.అంతే కాకుండా అక్కడ అభిమానులు తెచ్చిన కొణిదెల కుటుంబం అనే ఫ్లెక్సీ ని చూసి తన ఇంటి పేరు కొణిదెల కాదని నా ఇంటి పేరు తెలుగు అని,తాను తెలుగు జాతికి చెందిన వాడినని అంతే కానీ ఒక కులానికి మాత్రమే చెందిన వాడిని కాదని అలాగే ఒక ఇంటికి మాత్రమే చెందిన వాడిని కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.