నాకు గుండు కొట్టించడం..టీడీపీ నీచ రాజకీయాల్లో భాగం..పవన్ సంచలనం!

Friday, November 16th, 2018, 02:54:10 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరియు తెలుగుదేశం పార్టీ నేతలకు ఈ మధ్య ఏ స్థాయిలో మాటల దాడి జరుగుతుందో అందరికి తెలుసు.అయితే నిన్న తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో జరిగినటువంటి బహిరంగ సభలో పవన్ తన వ్యక్తిగత జీవితంలో టీడీపీ ఎలాంటి పాత్ర వహించిందో సంచలన నిజాలు బయటపెట్టారు.పవన్ యొక్క జీవితంలో ఎదుర్కొన్న సంచలన ఆరోపణ ఏదైనా ఉంది అంటే పవన్ చేయించుకున్న గుండు.పవన్ తానేదో విసుగు పుట్టి గుండు చేయించుకుంటే దాని మీద రకరకాల పుకార్లు టీడీపీ నేతలు సృష్టించారని పవన్ ఎప్పుడో తెలిపారు.

ఇప్పుడు మళ్ళీ నిన్న జరిగినటువంటి సభలో మాట్లాడుతూ..తెలుగుదేశం నాయకులు తనని తిట్టినంతగా ఏ పార్టీ నాయకులు కూడా తనని తిట్టలేదు అని,తాను నటుడుగా ఉన్నప్పుడే వారు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని,నన్ను పరిటాల రవి తీసుకెళ్లి గుండు కొట్టించాడంటా.. వాటి పైన ఎన్నో కథలు పుకార్లు తెలుగుదేశం నాయకులు సృష్టించరాని,అంతే కాకుండా తనని ఎన్ని అవమానాలు చేసినా సరే వాటిని అర్ధం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం వారికి మద్దతు ఇస్తే దాదాపు 9 నెలలు తన మీద టీడీపీ యొక్క పచ్చ ఛానెళ్లలో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నా జీవితం మీద డిబేట్లు, తన తల్లిని మీడియా ముఖంగా దూషించడాలు వంటివి చెయ్యించారని పవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.