ద‌టీజ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్.. ఇట్స్ అమేజింగ్.. సూప‌ర్ ఎస్కేప్..?

Thursday, December 6th, 2018, 05:20:19 PM IST

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల తెలంగాణ ఎన్నిక‌ల్లో త‌మ మ‌ద్ద‌తు ఎవ‌రి చెబుతామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో ప‌వ‌న్ మ‌ద్ద‌తు టీఆర్ఎస్‌కే ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయని చాలామంది అంచ‌నావేశారు. అయితే ఊరించిన ప‌వ‌న్ త‌న‌దైనవిధంగా తుస్సుమ‌నిపించారు. తాజాగా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఏపార్టీకి మ‌ద్ద‌తు తెల్ప‌క‌పోయినా… అవినీతి, ఓట్లు అంటూ చేసిన ప్ర‌క‌ట‌న త‌న గాలి తానే తీసుకునే విధంగా ఉంద‌ని రాజ‌కీయవిశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

తెలంగాణ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ఓట‌ర్ల‌ను ఉద్దేశించి ఏదో మెసేజ్ ఇద్దామ‌నుకున్న ప‌వ‌న్ స్టేట్‌మెంట్ మిస్‌ఫైర్ అయ్యింది. అవినీతికి వ్య‌తిరేకంగా ఓట్లు వేయాల‌ని చెప్పాల్సింది పోయి, ఎవరైతే తక్కువ అవినీతితో, ఎక్కువ పారదర్శకతతో పాలన సాగిస్తారో వాళ్లకు ఓటేయాలని పవన్ పిలుపు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ పై కామెంట్లు ప‌డుతున్నాయి. ప‌వ‌న్ చెప్పిన‌ట్టు త‌క్కువ అవినీతి చేసింది ఏ పార్టీ అని అంచ‌నా వేసుకోవాలి. ఒక‌వైపు మ‌హాకూట‌మి, మ‌రోవైపు టీఆర్ఎస్ మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ న‌డుస్తోంది.

ఇక ఆయ‌న చెప్పిన ప్ర‌కారం చూస్తే మ‌హాకూమిలో ఉన్న కాంగ్రెస్ పెద్ద అవినీతి పార్టీ అని ప‌వ‌న్ విమ‌ర్శిస్తూనే ఉన్నారు. అలాగే మ‌హాకూట‌మిలో భాగ‌మైన టీడీపీ పైన అయితే అవినీతికి అడ్డా కేరాఫ్ టీడీపీ అంటూ ఇటీవ‌ల ప‌వ‌న్ ద్వ‌జ‌మెత్తుతున్నారు. వారితో పోల్చుకుంటే టీఆర్ఎస్ పార్టీనే త‌క్కువ అవినీతి చేసింద‌ని భావించాలా.. ఇక ప‌వ‌న్ చెప్పిన పార‌ద‌ర్శ‌క‌త విష‌యానికి వ‌స్తే.. చంద్ర‌బాబు చేత‌ల్లో పార‌ద‌ర్శ‌క‌త లేక‌పోయినా.. ఆయ‌న చేసే వ్యాఖ్య‌ల్లో ఎక్కువ‌గా ఆ ప‌దం వినిపిస్తోంది.. కేసీఆర్ మాత్రం నువ్వా-నేనా అనే టైప్.. ఆయ‌న పెద్ద‌గా హంగామా చేయ‌రు.. ఈ లెక్క‌న చూసుకుంటే చంద్ర‌బాబు కూట‌మికి ఓటేయాలా.. మ‌రోసారి క్లారిటీ లేకుండా ప్ర‌క‌టన ఇచ్చారు ప‌వ‌న్. అయితే విశ్లేష‌కుల వాద‌న మ‌రోలా ఉంది.. ప‌వ‌న్ మ‌ద్ద‌తు టీఆర్ఎస్‌కే అని ప్ర‌క‌టిద్దామ‌నే లోపు తెర‌పైకి వ‌చ్చిన ఒక తాజా స‌ర్వే లీక్స్ ఆ పార్టీకి వ్య‌తిరేకంగా రావ‌డంతో, ప్లేటు మార్చిన ప‌వ‌న్, మ‌ద్ద‌తు విష‌యంలో తిక్క మెసేజ్ ఇచ్చి సూప‌ర్‌గా ఎస్కేప్ అయ్యార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.