టీడీపీ,వైసీపీ,లోకేష్ లకు పవన్ ఒకేసారి..దిమ్మతిరిగిపోయే కౌంటర్లు.!

Thursday, November 8th, 2018, 06:45:18 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో మరోసారి చంద్రబాబు మరియు లోకేష్ ల మీద విరుచుకుపడ్డారు.అయితే ఈ సారి ట్విట్టర్ లో కాదు పేస్ బుక్ లో విమర్శలు కురిపించారు.పవన్ కూడా ఇటీవలే తన పేస్ బుక్ పేజీని కూడా ప్రారంభించారు.ఇప్పటి వరకు ట్విట్టర్ లోనే ప్రశ్నించిన పవన్ ఇప్పటి నుంచి పేస్ బుక్ లో కూడా తన ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు.ఈ సారి వైసీపీ ని కూడా చేర్చడం గమనార్హం.అయితే ఈ రోజుతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఒక సంచలన విఫల నిర్ణయానికి రెండేళ్లు పూర్తయ్యింది.అదే పెద్ద నోట్ల రద్దు(డీమానిటైజేషన్),ఏదో జరిగిపోతుంది అని ఈ నిర్ణయం తీసుకుంటే ఇంకేదో జరిగింది అని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

అయితే ఇప్పుడు ఈ నిర్ణయం పట్లే జనసేనాని చంద్రబాబు,లోకేష్ మరియు వైసీపీ లను టార్గెట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. సంపాదించుకున్న డబ్బునే ఎ టి ఎం దగ్గర ఎంతో సేపు నించుని ఇబ్బందులు పెట్టి ఎంతో మంది సాధారణ ప్రజల యొక్క చావుకి కారణమైన ఈ నిర్ణయంకి ఆమోదం తెలిపింది మీ నాన్న గారు కాదా అని పవన్ లోకేష్ ని ప్రశ్నించారు.అంతే కాకుండా పెద్ద నోట్లు రద్దు చెయ్యాలని చెప్పింది నేనే అని చంద్రబాబు చెప్పుకున్న మాటలు కూడా నిజం కాదా ? అని ప్రశ్నించారు.ఇలాంటి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నపుడు బీజేపీ కి మద్దతు తెలిపింది మీరా మేమా అని ప్రశ్నించారు.పెద్ద నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు తీసుకురావడంని మీరు స్వాగతించలేదా మీతో పాటు వైసీపీ వారు కూడా వంత పలకలేదా అని తన పేస్ బుక్ పేజీ ద్వారా పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించారు.