పచ్చ మీడియాపై దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన పవన్..!

Tuesday, October 2nd, 2018, 09:59:39 PM IST


ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రజా పోరాట యాత్రలోని భాగంగా ఈ రోజు జంగారెడ్డి గూడెంకు చేరుకున్నారు.ఇటీవలే పవన్ కళ్యాణ్ ఒక దేవాలయంలో పవన్ తెల్లవారు జామున అర్చకుల సమక్షంలో కొన్ని పూజలు నిర్వహించగా వాటిపై బురద జల్లే ప్రయత్నంగా పవన్ తాంత్రిక పూజలు ఏవో చేయిస్తున్నారని కొన్ని పచ్చ మీడియా చానెళ్లు పవన్ మీద దుష్ప్రచారం చేద్దామని ప్రత్నించాయి.ఈ ప్రచారాన్ని సామాన్య జనంతో పాటు ఆయన అభిమానులు కూడా తిప్పికొట్టారు.ఈ రోజు ప్రజా పోరాట యాత్రలో పవన్ తన మీద దుష్ప్రచారం చేస్తున్న పచ్చ మీడియాకు గట్టిగానే సమాధానం ఇచ్చారు.

తాను లక్ష్మీ పురంలో తెల్లవారు జామున బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయిస్తే కొన్ని మీడియా ఛానళ్ళు దాన్ని ఏవో రహస్య పూజలు చెయ్యిస్తున్నాని మార్చేశారని,ఇటీవలే ఒక చిన్నారి తాను దాచుకున్న డబ్బుని జనసేన పార్టీకు సాయంగా అందజేయడానికి రాగ అందులోనుంచి పదకొండు రూపాయలు తీసుకున్నాని, ఈ పచ్చ మీడియా వారు దాని మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేసినా చేస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.మళ్ళీ అంతలోనే ఇక్కడి బుట్టాయిగూడెంలో అడవులను నరికి దోచుకెళ్తున్నపుడు మీడియా వారి స్ట్రింగ్ ఆపరేషన్లో అవి కనిపించవని,అడ్డగోలుగా రాజకీయ నాయకులు వేల కోట్లు దోచేస్తుంటే వాటి మీద స్ట్రింగ్ ఆపరేషన్లు చేపట్టరూ,ప్రజా సమస్యల పట్ల ఎవరూ మాట్లాడారు,ఎవరూ వార్తలు రాయరని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.