నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైల్లో కూర్చున్నారా..జగన్ కు పవన్ గట్టి వార్నింగ్.!

Thursday, December 6th, 2018, 10:00:42 PM IST

గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ మరియు వైసీపీ అధినేత జగన్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.పవన్ జగన్ మీద చేస్తున్నటువంటి ఆరోపణలకు గాను జగన్ తీవ్ర స్థాయిలో పవన్ మీద విమర్శలు చేసారు.అవి శృతి మించి వ్యక్తిగత జీవితం వైపు వెళ్లడంతో ఇరు పార్టీల శ్రేణులలో రగడ మొదలయ్యింది.జగన్ అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలకు గాను పవన్ ఈరోజు అనంతపురం గుంతకల్ లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో గట్టి వార్నింగే ఇచ్చారు.

నేను రాజకీయ పరమైన విమర్శలు చేస్తుంటే ఆయనేమో నా వ్యక్తిగతమైన విమర్శలు చేస్తున్నారు.నా పెళ్లిళ్ల వల్లనే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రాలేదు,నా పెళ్లిళ్ల వల్లే మీరు అసెంబ్లీకి వెళ్లడంలేదు,నా పెళ్లిళ్ల వల్లే జగన్ అన్ని నెలలు జైలు లో కూర్చున్నారు అంటూ వైసీపీ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.మేము రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం,ప్రత్యేక హోదా కోసం,పాలసీల కోసం మాట్లాడుతున్నామని,మీరు నా వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడితే నేను మీ పార్టీలో ఉన్నటువంటి వారి యొక్క ప్రతీ ఒక్కరి వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడుతానని పవన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.