పచ్చ మీడియాకు పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చిన పవన్..!

Tuesday, November 6th, 2018, 04:55:38 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పార్టీకి సంబంధించి కొన్ని మీడియా ఛానళ్ళు కొమ్ము కాస్తున్నాయి అన్న సంగతి అక్కడి ప్రతీ ఒక్కరికి తెలుసు.ఆ ఛానళ్ళు ఎవరికీ సపోర్ట్ చేస్తున్నారు,వారికే ఎందుకు కొమ్ము కాస్తున్నారు అన్న సంగతి పక్కన పెడితే గత కొన్ని నెలల నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీదనే టార్గెట్ చేస్తూ కావాలనే అతని మీద డిబేట్లు, పంచాయితీలు,రాజకీయాలు పరోక్షంగా పవన్ మీద వ్యతిరేకతను చూపిస్తూనే వారు టీఆర్పీ రేటింగులను ఒక రేంజ్ లో సంపాదించుకున్నారు,అన్న మాట కూడా వాస్తవమే అని చెప్పాలి,అయితే ఎన్నో నెలల నుంచి పవన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు,అయితే పవన్ మొన్న పెట్టినటువంటి ఒక బహిరంగ సభలో ఆండ్రు అనే వ్యక్తిని ఉద్దేసింది “లఫూట్” అని అన్న మాటకు కొన్ని చానెల్స్ లో పవన్ అలా మాట్లాడొచ్చా అని డిబేట్ల మీద డిబేట్లు గంటల కొద్దీ పెట్టేసారు.

అయితే వీరి అందరికి ఒకేసారి పవన్ నిన్న పెద్దాపురం లోని జరిగినటువంటి బహిరంగ సభలో మళ్ళీ పవన్ మీద డిబేట్ పెట్టలేని స్థాయిలో కౌంటర్లు ఇచ్చేసారు.బాలకృష్ణ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లిని దూషించినప్పుడు మీటింగులు పెట్టరు..అదే విధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే,వనజాక్షి అనే ఒక మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లిన వారి మీద డిబేట్లు పెట్టరు,అలాగే చింతమనేని ప్రభాకర్ దళితులని కులం పేరుతో దుర్భాషలాడినప్పుడూ డిబేట్లు పెట్టరు కానీ,నేను అడ్డగోలుగా అడవుల్లో బాక్సయిట్ మైనింగ్ లను దోచేసే వ్యక్తిని “లఫూట్” అంటే మాత్రం డిబేట్లు పెడతారా అని పవన్ ఒక వర్గం పచ్చ మీడియాకు దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చారు.