ఎవరో కోడి కత్తితో దాడి చేస్తే నేను సమాధానం చెప్పాలా..పవన్ షాకింగ్ కామెంట్స్.!

Wednesday, November 7th, 2018, 04:59:33 PM IST

గత నెల వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మీద శ్రీనివాసరావు మీద కోడి పందాలకు వినియోగించే కత్తితో హత్యా ప్రయత్నం చేసిన సంగతి తెలిసినదే.అయితే ఈ దాడి జరిగిన కొత్తలో ఎన్ని రకాల ఆరోపణలు వచ్చాయో అందరికి తెలుసు.ఒకరంటారు దాడికి పాల్పడిన వ్యక్తి వైసీపీకి చెందిన వాడే జగనే కావాలని చేయించుకున్నాడని అంటారు,చంద్రబాబునాయుడు గారు దాదాపు 8 నెలల క్రితమే జగన్ మీద మర్డర్ కి ప్లాన్ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు.ఇవన్నీ బాగానే ఉండగా అటు తిరిగి తెలుగుదేశం నేతలేమో ఆ దాడికి పాల్పడింది జనసేన పార్టీకి చెందిన యువకుడు అని ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే పవన్ నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో ఎవ్వరు ఊహించని స్థాయిలో సంచలన కామెంట్స్ చేసారు,కోడి పందాలకు ఉపయోగించే చిన్న చుర కత్తితో ఎవరో దాడి చేశారని జగన్ ఒక పక్క బాధ పడుతుంటే,తెలుగుదేశం నేతలేమో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.ఎవరో కుర్రాడు జగన్ మీద దాడి చేస్తే దాన్ని జనసేన పార్టీ మీదకి నెట్టే స్థితికి తెలుగుదేశం పార్టీ నేతలు దిగజారిపోయారని మండిపడ్డారు.రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు ఎలా తయారయ్యారంటే ఎక్కడో ఎవరో ఎవరితోనో పడుకుంటే దానికి కారణం కూడా పవన్ కల్యాణే అని అనే ధోరణి లోకి వచ్చేసారని పవన్ ఘాటైన విమర్శలు చేశారు.