పవన్ జీవితం ప్రజలకే అంకితం – పి. మధు

Friday, January 11th, 2019, 02:30:56 PM IST

రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకి అందరు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు నేతలు మద్దతు కూడా కోరుకుంటున్నారు. లెఫ్ట్ పార్టీలు, జనసేన పొత్తులకు ముందడుగు పడింది. ఈ సందర్భంగా విశాఖ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, జనసేనతో పొత్తుకు గల కారణాలు, తమ మీద ప్రజలకి ఉన్న అభిప్రాయాలకోసమే చర్చించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశ్యం తోనే రాజకీయాల్లోకి వచ్చాడని, నిస్వార్థం లేని నాయకుడు పవన్ కళ్యాణ్ అని పొగడ్తలతో ముంచెత్తాడు. అంతే కాకుండా ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలో అధికారికంగా చర్చించుకున్న తరువాతే నిర్ణయిస్తామని తెలిపారు.

ఇక్కడ చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటినుండి అంతటా మోసం జరుగుతుందని, చాలా ఫ్యాక్టరీలు మూతబడ్డాయని ఆరోపించారు మధు. ఐదు రాష్ట్రాలలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు దళితులు ఓట్లు వేశారు… అందుకే అగ్రవర్ణాల వారికి కొత్తగా రూపొందించిన రిజర్వేషన్ తెరపైకి తెచ్చారని విమర్శించారు. కేవలం వారి సొంత లాభం కోసమే బీజేపీ ప్రయత్నిస్తుందని ప్రజలను అసలే పట్టించుకోవడం లేదని మధు ఆరోపించారు. ఇక ఫెడరల్ ఫ్రంట్ వల్ల ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు మధు.