పవన్ తరువాతి టార్గెట్ ఆ ప్రాంతమేనా..?

Sunday, November 13th, 2016, 01:31:14 PM IST

pk-pawan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస సభలతో రాజాకీయం గా యమా జోరు మీద ఉన్నాడు. అనంతపురం సభ విజయవంతం కావడం, తానూ ఎమ్మెల్యేగా 2019 లో పోటీ చేస్తున్నానని ప్రకటించడంతో జనసేన కార్యకర్తల్లో అంతులేని ఉత్సాహం నెలకొని ఉంది.పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తిరుపతి, కాకినాడ, అనంతపురంలలో బహిరంగ సభలు నిర్వహించాడు.ఇక పవన్ అన్నిరకాలుగా వెనకబడ్డ ఉత్తరాంధ్రలో తన తదుపరి బహిరంగ సభని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సభ విశాఖలో ఉండే ఆవకాశం ఉందని జనసేన వర్గాలు అంటున్నాయి. పవన్ కు ఉత్తరాంధ్ర అంటే ఎప్పుడూ అభిమానమే. శ్రీకాకుళంయాసలో ఉండే జానపద గేయాలను పవన్ బాగా ఇష్టపడతారు.అక్కడి పవన్ అభిమానులు తారాస్థాయిలో ఉంటారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ హరిబాబు, సమీప ప్రత్యర్థి విజయమ్మ పై భారీ మెజారిటీ తో గెలుపొందడానికి కారణం పవన్ అభిమానులే అనేది బహిరంగ రహస్యం.ఈ నేపథ్యం లో పవన్ ఉత్తరాంధ్ర లోని ఏదేని ప్రాతం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్న అభిమానులు లేకపోలేదు.