పాత చింతకాయ పచ్చడిల ఉంది పవన్ పద్దతి… నటి మాధవీలత

Tuesday, November 6th, 2018, 10:14:28 PM IST

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటి మాధవీలత సంచలన వాక్యలు చేసారు. ఇంకా పవన్ కి ఒక సూచన కూడా ఇచ్చారు మాధవీలత. ప్రతి బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ మాత్రమే మాట్లాడుతారని, మిగతావాళ్ళు మాట్లాడలేదని, ఒకవేళ కొందరు మాట్లాడినా ఎప్పుడో, ఎక్కడో మాట్లాడి అలా వెళ్లిపోతున్నారని తెలిపారు. ఆలా ఎప్పటికి పవన్ ఒక్కరే మాట్లాడటం అసలే మంచిది కాదని మాధవీలత విమర్శించారు. ఈ మేరకు మాధవీలత తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టారు. నేను పవన్ గారిని విమర్శించడం లేదని, అది ఒక సూచన మాత్రమేనని ఆమె పోస్ట్ లో ముందుగానే పేర్కొన్నారు. ఎక్కడ మీటింగ్స్ జరిగిన కూడా పవన్ కళ్యాణ్ ఒక్కరే మాట్లాడటాన్ని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్‌ను కలవాలంటే ఆయన కార్యాలయం వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్‌ను దేవుడిలా అభిమానించేవాళ్లు, పలువురు సీనియర్ జర్నలిస్టులు ఈ మాటలు చెప్పారని, ఆయనను కలవాలంటే చాల సేపు నిరీక్షించాలని చెప్పారని, వెయిట్ చేసి చేసి అసహనంతో, బాధతో వారు ఆ మాటలు చెప్పారని అన్నారు. సీఎం, పీఎం లను కలిసేందుకు కూడా ఓక విధానం ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు మాత్రం లేదని ఆమె వాపోయారు.

జనసేనానిని కలిసే మార్గం అర్థం కావడం లేదని మాధవీలత అన్నారు. ఇక్కడ నిర్వాహకులతో ఎదో లోపం ఉందని స్పష్టం చేసారు. ఒకవేళ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామనే విషయంలో పవన్ మాటల్లో క్లారిటీ లేదన్నారు. నిత్యం ఇతర పార్టీలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందన్నారు. ఇది సరైన విధానం కాదని, మనం చేయబోయేది చెప్పాలని, రెచ్చగొట్టడం ఒకప్పటి రాజకీయమని, మార్పు కోసం వచ్చిన వారు పాత చింతకాయ పచ్చడి తినడం నచ్చలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా చివరగా అయ్యా ఇది విమర్శ కాదు సలహా మాత్రమే. జనసేన మీటింగ్స్ అన్ని ఫాలో అవుతున్న ఒక్క మీటింగ్ లో కూడా వేరేవాళ్లు మాట్లాడారా, 2 గంటలు 4 గంటలు కళ్యాణ్ గారి మాటలేనా పక్కన మహిళలు డమ్మి గ ఉండటం ఏంటి. ఎక్కడో ఎపుడో అలా అలా మాట్లాడి వెళ్తున్నారు స్టేజి మీద మొదట నాయకుడి స్పీచ్ ఉండదు కానీ ఇక్కడ ఎందుకు ఉంటుంది ఇంకా మాట్లాడే వారే లేరా, అధికారం లోకి వస్తే ఏమి చేస్తాము క్లారిటీ ఉండటం లేదు స్పీచెస్ లో . ఎంతసేపు పక్క పార్టీ లని విమర్శించమే ఎందుకో సరికాదు మనమేంటి మనం ఎం చేస్తాం విధులు విధానాలు చెప్పాలి. ద్వేషాలని రెచ్చగొట్టడం ఒకప్పటి రాజకీయం . మార్పు కావాలని వచ్చిన వారు కూడా అదే పాత చింతకాయ పచ్చడి తినడం నచ్చలేదు నాకు . ఇది నా అభిప్రాయం..’ అని పేర్కొన్నారు.