ఇంటర్నెట్ లేకుండా పేటటీఎమ్ ఆఫ్ లైన్ పేమెంట్స్

Saturday, April 28th, 2018, 05:50:38 PM IST

ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ చాలా పెరిగిపోయింది. కానీ కొంత మంది భారత్ లో ఇంకా ఇంటర్నెట్ ని వినియోగించలేకపోతున్నారు. అన్ని ఆన్ లైన్ పేమెంట్స్ కావాలని ఓ వైపు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పటికీ పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. అయితే ప్రస్తుతం ఆన్ లైన్ లావా దేవీల్లో మంచి ఆదరణ పొందుతోన్న పేటిఎమ్ సరికొత్త ఆలోచనను ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ లేకపోయినప్పటికీ హాఫ్ లైన్ పేమెంట్ ను ప్రవేశపెట్టింది. ‘టాప్‌ కార్డ్‌’ సిస్టమ్ అనే ఈ సరికొత్త ఆప్షన్ తో వేగంగా డబ్బు బదిలీ చేసుకోవచ్చు.

భారతదేశంలో మొట్ట మొదటి సారి ఈ తరహా ఆఫ్‌లైన్‌ పేమెంట్స్‌ సొల్యూషన్‌ ని స్టార్ట్ చేశారు. టాప్ కార్డ్‌ ఎన్‌ఎఫ్‌సీ(నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌) తో కంపెనీ గుర్తించిన పాయింట్‌ ఆఫ్‌ సేల్‌(పీఓఎస్‌) టర్మినల్‌కు నగదు బదిలీ అవ్వడం జరుగుతుంది. సెకనులో ఇంటర్నెట్ లేకపోయినా పేటీఎం టాప్‌ కార్డు తో ఆఫ్‌లైన్‌ పేమెంట్స్‌ విజయవంతంగా చేసుకోవచ్చని యాజమాన్యం వెల్లడించింది. ఇప్పటికే పేటీఎం అత్యధికులు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో కూడా కంపెనీ బ్రాండ్ విలువను పెంచుకునేలా ప్రయత్నం చేస్తోంది. ఆఫ్ లైన్ పేమెంట్ సక్సెస్ అయ్యిందంటే పేటిఎమ్ బ్రాండ్ విలువ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.

  •  
  •  
  •  
  •  

Comments