మోడీని ప్రజలు ఇంటికి పంపడానికి సిద్ధంగా వున్నారు : ప్రముఖ నటుడు

Sunday, April 29th, 2018, 11:52:18 AM IST

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటన పరంగా ఆయన చేసిన పాత్రలు, వాటిలో ఆయన ఒదిగిపోయిన విధానం చూస్తే నిజంగా హాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. కొన్ని పాత్రలు ఆయనకోసమే పుట్టాయేమో అనేలా పాత్రకు జీవంపోస్తారు. అయితే ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ఒకవారిపు సినిమాలు చేస్తూనే, మరోవైపు రాజకీయంగా కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గతకొద్ది రోజులుగా ఆయా బిజెపి నేతలపై అలానే ప్రధాని మోడీపై జస్ట్ ఆస్కిన్గ్ పేరుతో సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో రకరకాల ప్రశ్నలు సంధించారు. అయితే ఆ మధ్య కొందరు బిజెపి నేతలు కూడా ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయ్యారు కూడా.

అయితే ప్రస్తుతం ఆయన మళ్ళి మోడీని టార్గెట్ చేశారు. మోడీ ఇటీవల చేసిన ఒక ట్వీట్ పోస్ట్ చేస్తూ తాను కూడా కన్నడిగానే అన్న విషయం పై ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. అవును మీరు కన్నడిగ గుజరాత్ లో గురజారాతి. మీరు ఒక పెద్ద అబద్ధాలకోరు అనడానికి ఇంతకన్నామరే సాక్ష్యం కావలి అన్నారు. మీకు నిజంగా మతి చెలించింది. ఎందుకంటె ప్రస్తుతం కర్ణాటక లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కన్నడిగా అంటున్నారు, లేకపోతే హాయిగా ఏదో ఒక దేశంలో హ్యాపీగా ఒక కప్పు కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతుండేవారని విమర్శించారు .

కాంగ్రెస్, సీపీఐ, సిపియం ఇలా దేశంలోని అన్ని పార్టీలకు సిద్ధాంతాలు ఉన్నాయని, కానీ దేశంలో ఎటువంటి సిద్ధాంతాలు లేని ఏకైక పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అని అన్నారు. మీరు కన్నడిగా అన్నారుగా కదా, మీకు మా రాష్ట్రం వాళ్ళు కన్నడం నేర్పిస్తారు. కానీ అది బడిలో కాదండోయి వృద్ధాశ్రమంలో అని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో మీరు ఒక నిరుద్యోగిగా మిగిలిపోతారు, ఎందుకంటె రానున్న ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా వున్నారని అన్నారు. అయితే ప్రస్తుతం హేతువాది అయిన ప్రకాష్ చేస్తున్న ఈ ట్విట్టర్ యుద్ధం పై కొందరు నెటిజన్లు సమర్థిస్తున్న, మరి కొందరు మాత్రం ఆయన వాదన సరైనది కాదని అంటున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments