100 నోట్లు ఎత్తేసి 200 నోట్లు తేవాలి!

Wednesday, November 16th, 2016, 02:21:33 AM IST

100
ఇప్పుడున్న 100 నోట్ల‌లో దొంగ నోట్లెన్ని? పాకిస్తాన్ నుంచి వ‌చ్చిన దొంగ నోట్ల‌లో వంద నోట్లు లేవ‌ని అనుకున్నా లోక‌ల్‌గా మాఫియా గ్యాంగ్‌లు త‌యారు చేసిన నోట్లు బోలెడ‌న్ని మార్కెట్లలో తిరిగేస్తున్నాయ్‌. అవ‌న్నీ వృథాగా పోవాలంటే క‌చ్ఛితంగా 100 నోట్ల‌ను ర‌ద్దు చేసి ఆ స్థానంలో 200 నోట్లు తేవాలి. ఈ విష‌యంలో ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ జ‌ర‌గాలి. .. ఇదీ జ‌నాల్లో సాగుతున్న చ‌ర్చ‌.

అయితే ఇదిలా ఉండ‌గానే 100 నోట్లు, చిల్ల‌ర లేక నానా తంటాలు ప‌డుతున్న ప్ర‌జ‌ల్ని ఉద్ధేశించి చంద్ర‌బాబు ఓ ప్ర‌క‌ట‌న చేశారు. దేశంలో రెండు వేల రూపాయల కొత్త నోటుకు చిల్లర దొరక్క సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బంది తొల‌గాలంటే త‌క్ష‌ణం 200 నోట్లు తేవాల్సిందేన‌ని కేంద్రాన్ని కోరారు. 50 నోట్లు సాధ్య‌మైనంత ఎక్కువ‌గా అందుబాటులో ఉండేలా చూడాల‌ని అన్నారు బాబు. కిరాణ, రైతుబ‌జార్లు, జ‌న‌ర‌ల్ దుకాణాల వ‌ద్ద చిల్ల‌ర స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించాలంటే బ్యాంకులు చిల్ల‌ర‌ను ఎక్కువ‌గా పంప్ చేయాల‌ని సూచించారు. ఇప్ప‌టికే ఏపీలో 6,700 కోట్లు డిపాజిట్ చేశార‌ని రివీల్ చేశారు బాబు.