మానసిక రుగ్మత ఉంటే ఆ వ్యాధి వచ్చే అవకాశం రెట్టింపు ఉందట!

Friday, June 15th, 2018, 09:33:02 AM IST

ప్రస్తుత కాలంలో మానవుడి జీవన విధానం, తినే ఆహరం, వాతావరణ పరిస్థితులు వంటి తదితరాల వల్ల వయసుతో సంబంధం లేకుండా పలు రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి వంద మందిలో దాదాపు 40 నుండి 50 మందికి డయాబెటిస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ ఉంటుంది అంటే, మనం ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నామో అర్ధం చేసుకోవచ్చు. ఇకపోతే డాక్టర్లు ఇటీవల చేపట్టిన ఒక సర్వే లో భాగంగా ఎవరైతే ఎక్కువగా మానసిక సమస్యలతో బాధపడుతుంటారో, అటువంటి వారికి దియాబెటిస్ వచ్చే అవకాశం మరింత ఎక్కువని, అదికూడా టైపు-2 డయాబెటిస్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. నిజానికి డయాబెటిస్ వ్యాధి రాకుండా నిరోధించడం మంచిదని, ఒకవేళ అది వస్తే పూర్తిగా నయమయే అవకాశం చాలావరకు లేనట్లే అనేది మనకు తెలిసిందే. పైగా ఆ వ్యాధి బారిన పడిన వారికి దాని వల్ల వచ్చే సమస్యల గురించి ఇంకా బాగా తెలియడంతో అటువంటి వారు కూడా ఇతరులను దాని బారిన పడకుండా జాగ్రత్త పాడమని హెచ్చరిస్తుంటారు.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 15వేలమంది మానసిక రుగ్మతలతో బాధపడేవారిలో దాదాపు 30 శాతం మందికిపైగా టైపు-2 డయాబెటిస్ ఉందని, అదే ప్రస్తుతం వున్న మన సాధారణ జనాభాలో అయితే దాదాపు 12 శాతం మందికి ఆ వ్యాధి ఉందని నిర్ధారించారు. అదే జాతులు, వర్ణాల పరంగా చూస్తే ఆఫ్రికన్ అమెరికాన్స్ లో 36 శాతం, స్పానిష్ కు చెందిన అమెరికన్స్ లో 37 శాతం, ఇక ఆసియా ప్రాంతాల వారిలో 30 శాతం, ఇక తెల్లజాతికి చెందిన వారిలో అయితే 25 శాతానికి పైగా మానసిక రుగ్మతలకు గురై ఈ వ్యాధిని పడుతున్నట్లు తేలిందట. కాబట్టి ఇకనైనా సరైన సమయానికి ఆహరం, సరిపడా నిద్ర, శారీరక వ్యాయామం, మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయడం వంటివి చేస్తే ఈ టైపు-2 దియాబెటిస్ బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు. సో బి కేర్ఫుల్ ……