చ‌ర్చ‌ల్లో విశాఖ చెన్న‌య్ పెట్రోకెమిక‌ల్ కారిడార్‌

Sunday, January 29th, 2017, 12:10:35 AM IST

petrocamical
దాదాపు ప‌దేళ్ల క్రింద‌ట స‌త్యం రామలింగ‌రాజు ఐటీ కుంభ‌కోణంతో వార్త‌ల్లోకి వ‌చ్చిన‌ప్పుడు విశాఖ‌-చెన్న‌య్ పెట్రోకెమిక‌ల్ కారిడార్ గురించి కూడా ప్ర‌ముఖంగా వార్త‌లొచ్చాయి. అన్ని ప్ర‌ధాన దిన‌ప‌త్రిక‌ల్లోనూ బ్యాన‌ర్ ఐటెమ్‌ల‌తో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు విశాఖ‌-చెన్న‌య్ పారిశ్రామిక కారిడార్‌కి వ‌చ్చి వాలిపోతున్నాయ్‌! అంటూ అప్ప‌ట్లో తేదేపా ప‌త్రిక‌లతో పాటు ఇత‌ర‌త్రా ప‌త్రిక‌లు, జాతీయ ప‌త్రిక‌లు ఘోషించాయి. క‌ట్ చేస్తే అబ్బే ఈ కారిడార్ పూర్త‌వ్వ‌డానికి నిధుల్లేవ్‌. విదేశాలు సానుకూలంగా లేవు అంటూ కొన్ని వార్త‌లు ముప్పిరిగొలిపాయి. ఏం లాభం ఏపీకి సుదీర్ఘంగా ఉన్న స‌ముద్ర తీరం వ‌ల్ల ఏ ఉప‌యోగం లేకుండా పోయింది. ఈ తీరం వెంబ‌డి ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ నిరుపేద‌రికాన్నే అనుభ‌వించాల్సి వ‌చ్చింది. జ‌స్ట్ రాజ‌ధాని న‌గ‌రం అన్న పేరుతో హైద‌రాబాద్ ఒక్క‌చోటికే ల‌క్ష‌ల కోట్ల ఐటీ పెట్టుబ‌డులు, పారిశ్రామిక పెట్టుబ‌డులు వ‌చ్చాయి. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంతో ఇక్క‌డ రాళ్లు ర‌ప్ప‌లు ర‌త్నాలు అయిపోయాయ్‌.

సేమ్ టైమ్ ప్ర‌కృతి అందాల‌తో అల‌రారే విశాఖ తీరం కానీ, కోస్తా తీరం వెంబ‌డి ప‌చ్చందాలు కానీ ప్ర‌భుత్వాల క‌ళ్ల బ‌డ‌లేదు. కానీ ఇప్పుడు క‌ళ్ల బ‌డ్డా పెట్టుబ‌డులు రావ‌డం క‌ష్టంగానే ఉంది. దీంతో విశాఖ‌- చెన్న‌య్ సుదూర పెట్రో కెమిక‌ల్ కారిడార్‌కి సంబంధించి వార్త‌లే కానీ, పెట్టుబ‌డులు వాస్త‌వంగా వ‌చ్చిందేం లేదు. కేవ‌లం స‌ర్వేల పేరుతో జాగారం చేయ‌డం త‌ప్ప తీరం వెంబ‌డి ర‌హ‌దార్ల నిర్మాణాలు కానీ, వేరే ఏదీ క‌నిపించ‌నేలేదు. గ‌త ఏడాది ప్ర‌పంచ‌దేశాల వాణిజ్య వ్యాపారుల‌తో విశాఖ న‌గ‌రంలో 4 ల‌క్ష‌ల కోట్ల విలువ చేసే ఎంఓయూలు కుదుర్చుకున్న ఏపీ ప్ర‌భుత్వం మ‌రోసారి విశాఖ‌- చెన్న‌య్ పెట్రోకెమిక‌ల్ కారిడార్ గురించి కెలికింది. కానీ దానికి పెట్టుబ‌డులు వ‌స్తున్నాయా? రాలేదా? అన్న‌దానిపై ఎలాంటి క్లారిటీనివ్వ‌లేదు. ఏదైతేనేం ఈ ఏడాది కూడా మ‌రోసారి విశాఖ‌లో జ‌రుగుతున్న సీఐఐ (ప్ర‌పంచ‌దేశాల వాణిజ్య స‌ద‌స్సు) లోనూ మ‌రోసారి విశాఖ‌- చెన్న‌య్ పెట్రో కెమిక‌ల్ కారిడార్‌కి సంబంధించిన చ‌ర్చ సాగింది. మొత్తానికి ఈ కారిడార్‌కి ఆర్థిక‌సాయం అందించేందుకు ఏడీబీ సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. భార‌త్‌లో పారిశ్రామిక కారిడార్ల‌కు ఏడీబీ సాయం చేస్తాన‌ని ప్ర‌క‌టించింది. ప‌నిలో ప‌నిగా విశాఖ‌-చెన్న‌య్ కారిడార్‌కి ఆర్థిక వ‌నరుల్ని చేకూరుస్తాన‌ని మాటిచ్చింది. అయితే మాట స‌రే.. ఇది అమ‌ల‌య్యేదెప్పుడు? అస‌లు ఇది ఎప్ప‌టికి సాకార‌మ‌వుతుంది? ఈ జ‌న‌రేష‌న్‌కి అందుబాటులోకి వ‌స్తుందా? లేదూ .. కాగితాలు, ప‌ద్దుల్లోనే మిగిలిపోతుందా? కాల‌మే స‌మాధానం చెప్పాలి.