మళ్ళీ భగ్గుమన్న పెట్రోలు ధరలు….

Saturday, September 8th, 2018, 12:35:51 PM IST

పెరుగుతున్నకాలం తో పాటు ప్రస్తుతం ఉన్న రోజుల్లో పెట్రోలు ధర కూడా అలా పెరిగిపోతూనే ఉంది కానీ ఒక్క రూపాయి కూడా తగ్గడం లేదు. దీనికి కారణం ముడి చమురు ధర పెరిగిపోవడం, అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి యొక్క విలువ క్రమ క్రమంగా పడిపోడమే అని అంటున్నారు. పెరుగుతున్న పెట్రోలు డీసెలు ధరలు చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు.

కనీసం పెట్రోలు ధర పెంచే ముందు ప్రజలకి తెలియజేయట్లేదు అని వాపోతున్నారు, గడిచిన ఈ కొన్ని రోజుల్లోనే పెట్రోలు ధర 3.24 పైసలు పెరిగిపోయింది, ఈ శుక్రవారం ఒక్కరోజే 48 పైసలు పెరిగిపోయింది, ఒక్కరోజు పూర్తవక ముందే మళ్ళీ ఈ రోజు 39 పైసలు పెరిగిపోయింది. భారతదేశం లో కొన్ని ముఖ్య నగరాల్లో పెట్రోలు ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైద్రాబాదు లో 83.27 పైసలు, ఢిల్లీలో 80.38 పైసలు అత్యధికంగా తమిళనాడులో 87.77 గా ఉంది అని తెలుస్తుంది. పెరుగుతున్న పెట్రోలు ధరలకు నిరసనగా ఈ నెల 10 తారీఖున దేశ వ్యాప్తంగా బంద్ చేయనున్నారు అన్నట్టు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments