మూవీ రివ్యూ : పేట

Thursday, January 10th, 2019, 08:16:04 PM IST

 

సూపర్ స్టార్ రజిని కాంత్ హీరోగా సిమ్రాన్,త్రిష మరియు విజయ్ సేతుపతి వంటి అగ్ర తారాగణంతో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో అనిరుద్ సంగీతంలో తెరకెక్కిన చిత్రం “పేట”. 2.0 సినిమాకి వచ్చిన ఫలితంతో సూపర్ స్టార్ యొక్క మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిందనే చెప్పాలి.మిగతా సినిమాలతో పాటు ఈ చిత్రం కూడా సంక్రాంతి రేసులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాడిని ముందుకొచ్చింది.మరి చిత్రం ఎంత వరకు అంచానాలను అందుకుందో ఇప్పుడు చూద్దాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే పేట(రజిని కాంత్) ఒక హాస్టల్ లో “కాళీ”గా వార్డెన్ గా పని చేస్తుంటారు.అక్కడే ప్రాణిక్ హీలర్ గా పనిచేసే సిమ్రాన్ రజిని పరిచయం అవుతారు.ఒక ఊహించని ట్విస్ట్ తో రజిని పై ఒక గ్యాంగ్ దాడి చేస్తారు.అసలు రజిని పై దాడి చేసిన ఆ గ్యాంగ్ ఎవరు?అసలు అక్కడ వార్డెన్ గా పని చేస్తున్న రజిని యొక్క ఫ్లాష్ బ్యాక్ ఏంటి?త్రిష,విజయ్ సేతుపతి మరియు నవాజుద్దీన్ సిద్ధికీకి పేట కి,ఈ కథకి ఉన్న సంబంధం ఏమిటి అన్నది తెలుసుకోవాలి అంటే వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ సినిమా మొదలవ్వడమే అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ తో మొదలవుతుంది.సూపర్ స్టార్ రజిని మరోసారి తనదైన శైలి స్టైలిష్ నటనతో అదరగొట్టేసారు.కొన్ని ఆసక్తికర సన్నివేశాలతో ట్విస్టులతో మొదటి సగం అంతా బాగానే సాగుతుంది.పిశాచి సినిమా హీరో నాగ్ మరియు మేఘా ఆకాష్ లు తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు.ఇక అనిరుద్ సంగీతానికి వస్తే మాసు మరనం పాట తో అదరగొట్టినా మిగతా పాటలతో పర్వాలేదనిపించారు.కానీ ఎప్పటిలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే రేంజ్ లో ఇచ్చారు.ఇలా అభిమానులకు నచ్చే అన్ని అంశాలతో మంచి యాక్షన్ బ్లాక్ మరియు ఆసక్తికర ట్విస్ట్ తో మొదటి సగం అంతా కార్తీక్ సుబ్బరాజ్ బాగానే నెట్టుకొచ్చేసారు.

ఇక రెండో సగానికి వచ్చేసరికి మొదలు సీన్లను చూస్తే పర్వాలేదనిపించినా ఇక నుంచి జరగబోయే సీన్లను ప్రేక్షకుడు ముందే అంచనా వేసేస్తాడు.దానితో అన్ని రివెంజ్ డ్రామాలాలనే ఈ సినిమా కూడా అనిపిస్తుంది.ఇక నటీనటుల విషయానికి వస్తే రజిని ఫ్లాష్ బ్యాక్ లో అతని భార్యగా త్రిష,అతని స్నేహితునిగా శశి కుమార్,మరో ముఖ్య పాత్రలో సిమ్రాన్ లు తమ పాత్రలకు సరైన న్యాయం చేకూర్చారు.ఇక దర్శకుని పనితనంకి వచ్చినట్టయితే ముందు మంచి సబ్జెక్టుని ఎన్నుకున్నారనిపించినా అది ఆ అంచనాలను ప్రేక్షకుడు కోల్పోడానికి కూడా ఎంతో సమయం ఇవ్వలేదు.రజినీని ఎలివేట్ చేసే సీన్లను బాగానే రాసుకున్నా కథ మొత్తం రొటీన్ గానే అనిపిస్తుంది.ఈ సినిమాలో మరో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి పాత్రని దర్శకుడు బాగానే రాసుకున్నా రజిని మరియు సేతుపతిల మధ్య వచ్చే కొన్ని సీన్లు సినిమా ట్రాక్ ను పక్క దారి పట్టించినట్టు అనిపిస్తుంది.ఇక విలన్ గా నవాజుద్దీన్ సిద్దికీ బాగానే ఆకట్టుకుంటారు.

ప్లస్ పాయింట్స్ :

రజినీ మార్క్ స్టైలిష్ నటన.
అనిరుద్ సంగీతం మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్.
కథానుసారం వచ్చే కొన్ని ట్విస్టులు.
రజినీని ఎలివేట్ చేసే సీన్లు.

మైనస్ పాయింట్స్ :

పేలవమైన కథ
కాస్త సాగదీతగా సాగే సెకండాఫ్
త‌మిళ్ నేటివిటీ
ఆక‌ట్టుకోని ఇత‌ర పాత్ర‌లు( విజ‌య్ సేతుప‌తి, న‌వాజుద్ధీన్ సిద్ధిఖీని స‌రిగ్గా ఉప‌యోగించుకోలేదు)

తీర్పు :

మొత్తంగా చూసుకున్నట్టయితే “పేట” సినిమా కూడా అన్ని సినిమాల్లానే మాములు రివెంజ్ డ్రామానే.అక్కడక్కడా కొన్ని సన్నివేశాల మినహా తెరపై రజిని మార్క్ స్టైల్ ఆయన నటనా తీరు అభిమానులకు ఏ స్థాయిలో కావాలో ఆ రేంజ్ లోనే ఉంటాయి.కానీ దర్శకుడు ఎన్నుకున్న కథలో కొత్తదనం లోపించడంతో సాధారణ ప్రేక్షకులకి పెద్ద కొత్తగా ఏమి అనిపించదు.

Rating : 2.5/5

REVIEW OVERVIEW
Petta Movie Review in Telugu